ధరంధర్ బాగుంది.. కానీ!... హృతిక్ రోషన్ పోస్టు వివాదం...

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన సినిమా ‘ధురంధర్’. ఈ నెల 5న థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

 hrithik roshan

హృతిక్ రోషన్

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన సినిమా ‘ధురంధర్’. ఈ నెల 5న థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘ధురంధర్’ రివ్యూ ఇచ్చారు. ‘నాకు ధురంధర్ సినిమా చాలా నచ్చింది. హృదయానికి హత్తుకునేలి తీర్చిదిద్దిన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కథను ఇంత అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులకు అందించారు. అయితే ఇందులో చూపించిన రాజకీయపరమైన అంశాలను మాత్రం నేను అంగీకరించలేకపోతున్నాను. కానీ దర్శకులు కొన్ని విషయాలపై బాధ్యాతయుతంగా వ్యవహరించాలి కాబట్టి అలా రూపొందిచారని నేను అనుకుంటున్నాను. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను ఈ చిత్రాన్ని ఆస్వాదించాను. దీని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అని తెలిపాడు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. సినిమాలో పాకిస్థాన్ ఉగ్రవాదులను క్రూరులుగా చూపారు. దీనిపై హృతిక్ స్పందించాడా? అన్నది తెలియాల్సి ఉంది.


విభూది వస్త్రం.. త్రిశూలమే అస్త్రం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్