సింగర్ చిన్మయి ఫొటోని మార్ఫింగ్ చేసిన కొందరు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి.. తన ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది.
చిన్మయి
సింగర్ చిన్మయి ఫొటోని మార్ఫింగ్ చేసిన కొందరు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి.. తన ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇలాంటి సైకోలతో మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ‘ఈరోజు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన నా చిత్రాన్ని తీసుకొని పోలీసులను ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది సమస్య కాదు. మా కుటుంబాన్ని వేధించడానికి గత 8-10 వారాలుగా డబ్బు చెల్లించి ఇలాగే చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు వారి భార్య, చెల్లెళ్లను ఎక్కువగా వేధిస్తారు. ఈ సైకోల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించింది. పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని కోరుకునే ఇలాంటి అబ్బాయిలకు అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేయాలా? అని ప్రశ్నించింది.