మహాభారతం, రామాయణం కవర్ చేస్తూ.. అఖండ2

మహాభారతం, రామాయణం కవర్ చేస్తూ.. అఖండ2

akhanda 2

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఇండస్ట్రీలో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలలో మంచి అంచనాలు ఉన్న సినిమా అఖండ 2. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు మంచి సక్సెస్ సాధించడం. అలానే ఈ కాంబినేషన్ మీద ఉన్న భారీ అంచనాలు. ఇవన్నీ కూడా సినిమా మీద ఒక రకమైన క్యూరియాసిటీని నెలకొల్పాయి. అలానే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. బాలకృష్ణ నుంచి ఎటువంటి మాస్ సీన్స్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాటన్నిటిని కూడా బోయపాటి శ్రీను డిజైన్ చేసి ఈ సినిమాలో పెట్టినట్లు అనిపిస్తుంది. ఇదివరకే రిలీజ్ అయిన సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈవెంట్ ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ హిందీలో అనర్గళంగా స్పీచ్ ఇచ్చారు. ఒక తరుణంలో ఈ సినిమా భారత దేశపు ఆత్మ అంటూ మాట్లాడారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా 3డీ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించడానికి మేకర్స్ తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీని గురించి తాజాగా తెలుగు ప్రెస్ మీట్ నుంచీ బోయపాటి శ్రీనుకి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. భారతీయ ఆత్మ అంటే రామాయణం, మహాభారతం, భగవద్గీత, అలాంటిది ఒక సినిమా భారతీయ ఆత్మగా ఎలా మారింది? అంటూ ఒక ప్రముఖ జర్నలిస్ట్ బోయపాటి శ్రీనుని ప్రశ్నించారు. దీనికి సమాధానం గా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఏదైనా సరే గంట కొడుతూనే చెప్పాలి. గంట కొట్టి చెబుతేనే సౌండ్ వినిపిస్తుంది. అది సాత్వికంగా చాలామంది చెబుతున్నారు. దానిలో సందేహం లేదు. కానీ అది కమర్షియల్ గా చెప్పినప్పుడు మాత్రమే ఎక్కుతుంది అని బోయపాటి సమాధానం ఇచ్చారు.


హిందువులను ఓటుబ్యాంకుగా మారుస్తా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్