Effects of Moles on Body | శరీరంపై పుట్టుమచ్చలు.. వాటి ఫలితాలు

మనిషి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలదీ ఓ పాత్ర అని చెప్పవచ్చు. వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాలను ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయి.

MOLES FEMALE OR MALE

ప్రతీకాత్మక చిత్రం

మనిషి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలదీ ఓ పాత్ర అని చెప్పవచ్చు. వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాలను ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో హస్త సాముద్రిక శాస్త్రం పుట్టుమచ్చల గురించి ఏమని చెబుతోంది? పుట్టుకతో పాటు వచ్చే మచ్చల ద్వారా మన భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చా? స్త్రీలు, పురుషులలో ఏయే భాగాల్లో పుట్టు మచ్చలు ఉంటే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

  • స్త్రీలకు పెదాలపై పుట్టుమచ్చలు ఉంటే వారు చాలా అందంగా, అందరినీ ఆకర్షించేలా ఉంటారు. ఇలాంటి స్త్రీలను పురుషులు ఎక్కవగా ఇష్టపడతారు.
  • పెదవి కింద పుట్టుమచ్చ ఉండే మహిళలు, తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. వీరు తమ ప్రయత్నాలతో ఎలా విజయం సాధించాలో బాగా అవగాహన కలిగి ఉంటారు.
  • నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే, వారికి ఆత్మవిశ్వాసం ఎక్కవగా ఉంటుందట. ఈ చోట పుట్టుమచ్చలున్న మహిళలు విజయం కోసం తమదైన మార్గంలో పయనిస్తారు. వారు ఏదైనా సొంతంగా చేసేందుకు ఇష్టపడుతారు.
  • మహిళల కంటికి పైన ఉన్న, రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉంటే వారు చాలా అదృష్టవంతులు అవుతారట. వీరు కోటిశ్వరుడిని వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వీరు ఎల్లప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరి దగ్గర అపారమైన సంపద ఉంటుంది.
  • స్త్రీల కళ్లలో ఎడమ వైపు లేదా కుడి వైపు కనుపాపల దగ్గర పుట్టుమచ్చ ఉంటే, అలాంటి మహిళలు చాలా ప్రశాంతంగా, తెలివిగా ఉంటారు. వీరు ఏ పనిచేసినా కచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపార రంగంలో వీరికి తిరుగుండదు.
  • మెడపై పుట్టుమచ్చలు ఉన్న మహిళలు చాలా సహనంతో ఉంటారు. వారు తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. వీరు చాలా తెలివిమంతులు. అంతేకాకుండా ఈ అమ్మాయిలు తెలివైన వారిని తమ జీవితంలో భాగస్వాములుగా ఎంచుకుంటారు.
  • జననేంద్రియాలపై లేదా వాటికి దగ్గర్లో పుట్టుమచ్చలు ఉంటే వారు శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తారట.
  • ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై, నాలుక భాగంలోనూ పుట్టుమచ్చలు ఉన్న వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. 
  • తలపై మాడు భాగానికి కుడివైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే, రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది. మంచి ఆలోచనాపరులైనవారు. తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందుచూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు.
  • నుదుటి భాగాన పుట్టుమచ్చలు ఉన్న పురుషుడు, పది మందిలో మంచివాడు అనిపించుకుంటాడు. పరోపకారి అవుతాడు. అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమ్మలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది.
  • కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే వివాహం తొందరగా అవుతుంది. సుగుణశీలి గల భార్య లభిస్తుంది. భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడు అవుతాడు.ఈ పురుషుడు శాంత స్వభావంను కలిగి ఉంటాడు.
  • ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగి సుఖాలు, భోగాలు కలుగుతాయి.
  • నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. అలాగే మంచి జ్ఞానం కలిగి ఉండి నలుగురిలోనూ చమత్కారంగా మాట్లాడగలరు.
  • ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలను కలిగి ఉంటారు.
  • స్త్రీలకు చేతిపైన గానీ, నుదిటిపైన గానీ ఎరుపురంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. 
  • ఎదపై లేదా చెస్ట్ పైన పుట్టుమచ్చలు ఉంటే వీరికి కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి. వీరు అనుకున్నది సాధిస్తారు.
  • భుజం పైన పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడే మనసత్వం కలిగి ఉంటారు.
  • ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్