||ప్రతీకాత్మక చిత్రం||
కరోనా వల్ల చాలా మంది వ్యాక్సిన్ వేయించుకొన్నారు. అయితే తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటిష్ కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్రా కొవిషీల్డ్ వ్యాక్సిన్ పనితీరు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్సిన్ వలన వైరస్ పూర్తిగా తగ్గిపోయినా అది శరీరంలోని అవయవాలపై చూపిన ప్రభావం ఎక్కువగా పడుతోందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ యొక్క దుష్ఫలితాలు MRNA వాక్సిన్ తో పోలిస్తే అధిక దుష్ఫలితాలు కొవిషీల్డ్ వాక్సిన్ లో కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ వ్యాక్సిన్ వలన చాలామందిలో రక్తనాళాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. దీని వలన శరీర వివిధ భాగాలకు రక్తం సరఫరా ఆగిపోయి గడ్డలు కడుతుంది. దీనివలన గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తి ఆకస్మాత్తుగా కుప్పకూలే సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వలన మెదడుకు రక్తం ప్రసరణ ఆగిపోవడం వల్ల పక్షవాతాలు, క్షణాల్లో మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పది శాతం మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నట్టు తెలిపారు.