(Pic: ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, తెలంగాణ : తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. వరుస పెట్టి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా, గ్రూప్-2 నోటిఫికేషన్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. 783 పోస్టులకు గానూ గురువారం నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు కొత్త సంవత్సర కానుకను అందజేసింది. దరఖాస్తులు జనవరి 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మొత్తం 18 రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ సర్కారు.. ఫిబ్రవరి 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ : 29-12-2022
దరఖాస్తు ప్రారంభం : 18-01-2023
దరఖాస్తు చివరి తేది : 16-02-2023
హాల్ టికెట్ : పరీక్షకు వారం ముందు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు : రూ.200
ఎగ్జామ్ ఫీజు : రూ.120 (నిరుద్యోగులకు మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్లు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది)
పరీక్ష కేంద్రాలు : 33 చోట్ల
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
ఎంపిక విధానం : రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ వెరిఫికేషన్
పోస్టులు:
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్3 - 11
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ - 59
నయబ్ తహసీల్దార్ - 98
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్2 - 14
అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 63
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ - 09
మండల్ పంచాయత్ ఆఫీసర్ - 126
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ - 97
అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - 38
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) - 165
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేటివ్ సెక్రటేరియట్) - 15
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఆర్థిక శాఖ) - 25
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (న్యాయ శాఖ) - 07
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ ఎన్నికల కమిషన్) - 02
డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్2 - 11
అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - 17
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 09
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 17
మొత్తం పోస్టులు - 783
పూర్తి నోటిఫికేషన్ కోసం TSPSC Group-2 Notification పై క్లిక్ చేయండి