Maha Shivaratri | మహాశివరాత్రి రోజున తప్పకుండా ఈ అష్టోత్తరం చదవడం మర్చిపోవద్దు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, ఆధ్యాత్మికం: మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్ధశి నాడు మహాశివరాత్రిగా ధర్మసింధు వంటి శాస్త్రగంద్ర గ్రంథాలు తెలుపుతోంది. ఈ పండుగను చతుర్థశి రాత్రి పూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు శివుని లింగస్వరూపంలో జ్యోతి స్వరూపుడై భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి ఉదయం ప్రాత:కాలం నుండి ఉదయం 9 గంటల లోపు రోజ్ వాటర్ తో శివలింగాన్ని అభిషేకించి, అనంతరం పంచామృతాలతో అభిషేకం చేయాలి. అభిషేక సమయంలో శివ అష్టోత్తరం/పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ.. అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉండి తర్వాత సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివ నామాలను,శివపురాణం చదువుతూ జాగారం చేయాలి ఇలా చేయడం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో, విశేష శుభఫలితాలు పొందుతారు. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో శివున్నిఅభిషేకం చేయడం వల్ల పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం.

మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్ధశి నాడు మహాశివరాత్రిగా ధర్మసింధు వంటి శాస్త్రగంద్ర గ్రంథాలు తెలుపుతోంది. ఈ పండుగను చతుర్థశి రాత్రి పూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు శివుని లింగస్వరూపంలో జ్యోతి స్వరూపుడై భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి ఉదయం ప్రాత:కాలం నుండి ఉదయం 9 గంటల లోపు రోజ్ వాటర్ తో శివలింగాన్ని అభిషేకించి, అనంతరం పంచామృతాలతో అభిషేకం చేయాలి. అభిషేక సమయంలో శివ అష్టోత్తరం/పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ.. అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉండి తర్వాత సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివ నామాలను,శివపురాణం చదువుతూ జాగారం చేయాలి ఇలా చేయడం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో, విశేష శుభఫలితాలు పొందుతారు. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో శివున్నిఅభిషేకం చేయడం వల్ల పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం.

శివ అష్టకమ్

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానన్దభాజమ్ | 

భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

గలే రుణ్డమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలమ్ | 

జటాజూటగఙ్గోత్తరఙ్గైర్విశాలం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

ముదామాకరం మణ్డనం మణ్డయన్తం మహామణ్డలం భస్మభూషాధరం  తమ్ | 

అనాదిం హ్యపారం మహామోహమారం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

తటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశమ్ | 

గిరీశం గణేశం సురేశం మహేశం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

గిరీన్ద్రాత్మజాసఙ్గృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహమ్ | 

పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వన్ద్యమానం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్ | 

బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

శరచ్చన్ద్రగాత్రం గుణానన్దపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ | 

అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్ | 

శ్మశానే వసన్తం మనోజం దహన్తం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్సర్వదా భర్గభావానురక్తః | 

స పుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం విచిత్రైః సమారాద్య మోక్షం ప్రయాతి ||

ఇతి శ్రీశివాష్టకం సంపూర్ణమ్ || 


శివ పంచాక్షరి స్తోత్రం

ఓం నమః శివాయ శివాయ నమః ఓం

ఓం నమః శివాయ శివాయ నమః ఓం


నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥


మందాకినీ సలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥


శివాయ గౌరీ వదనాబ్జ బృంద

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।

శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ

తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥


వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య

మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥


యజ్ఞ స్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ ।

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥


పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥


శివ అష్టోత్తర శత నామావళి

ఓం శివాయ నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం శంభవే నమః

ఓం పినాకినే నమః

ఓం శశిశేఖరాయ నమః

ఓం వామదేవాయ నమః

ఓం విరూపాక్షాయ నమః

ఓం కపర్దినే నమః

ఓం నీలలోహితాయ నమః

ఓం శంకరాయ నమః (10)

ఓం శూలపాణయే నమః

ఓం ఖట్వాంగినే నమః

ఓం విష్ణువల్లభాయ నమః

ఓం శిపివిష్టాయ నమః

ఓం అంబికానాథాయ నమః

ఓం శ్రీకంఠాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం భవాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం త్రిలోకేశాయ నమః (20)

ఓం శితికంఠాయ నమః

ఓం శివాప్రియాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం కపాలినే నమః

ఓం కామారయే నమః

ఓం అంధకాసుర సూదనాయ నమః

ఓం గంగాధరాయ నమః

ఓం లలాటాక్షాయ నమః

ఓం కాలకాలాయ నమః

ఓం కృపానిధయే నమః (30)

ఓం భీమాయ నమః

ఓం పరశుహస్తాయ నమః

ఓం మృగపాణయే నమః

ఓం జటాధరాయ నమః

ఓం కైలాసవాసినే నమః

ఓం కవచినే నమః

ఓం కఠోరాయ నమః

ఓం త్రిపురాంతకాయ నమః

ఓం వృషాంకాయ నమః

ఓం వృషభారూఢాయ నమః (40)

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

ఓం సామప్రియాయ నమః

ఓం స్వరమయాయ నమః

ఓం త్రయీమూర్తయే నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం సర్వజ్ఞాయ నమః

ఓం పరమాత్మనే నమః

ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః

ఓం హవిషే నమః

ఓం యజ్ఞమయాయ నమః (50)

ఓం సోమాయ నమః

ఓం పంచవక్త్రాయ నమః

ఓం సదాశివాయ నమః

ఓం విశ్వేశ్వరాయ నమః

ఓం వీరభద్రాయ నమః

ఓం గణనాథాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం హిరణ్యరేతసే నమః

ఓం దుర్ధర్షాయ నమః

ఓం గిరీశాయ నమః (60)

ఓం గిరిశాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం భుజంగ భూషణాయ నమః

ఓం భర్గాయ నమః

ఓం గిరిధన్వనే నమః

ఓం గిరిప్రియాయ నమః

ఓం కృత్తివాససే నమః

ఓం పురారాతయే నమః

ఓం భగవతే నమః

ఓం ప్రమథాధిపాయ నమః (70)

ఓం మృత్యుంజయాయ నమః

ఓం సూక్ష్మతనవే నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగద్గురవే నమః

ఓం వ్యోమకేశాయ నమః

ఓం మహాసేన జనకాయ నమః

ఓం చారువిక్రమాయ నమః

ఓం రుద్రాయ నమః

ఓం భూతపతయే నమః

ఓం స్థాణవే నమః (80)

ఓం అహిర్బుధ్న్యాయ నమః

ఓం దిగంబరాయ నమః

ఓం అష్టమూర్తయే నమః

ఓం అనేకాత్మనే నమః

ఓం స్వాత్త్వికాయ నమః

ఓం శుద్ధవిగ్రహాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం ఖండపరశవే నమః

ఓం అజాయ నమః

ఓం పాశవిమోచకాయ నమః (90)

ఓం మృడాయ నమః

ఓం పశుపతయే నమః

ఓం దేవాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం హరయే నమః

ఓం పూషదంతభిదే నమః

ఓం అవ్యగ్రాయ నమః

ఓం దక్షాధ్వరహరాయ నమః

ఓం హరాయ నమః (100)

ఓం భగనేత్రభిదే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం సహస్రపాదే నమః

ఓం అపవర్గప్రదాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం తారకాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః (108)

ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిః సమాప్తః


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్