బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస ఆగడం లేదు. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి పారిపోయారు. అయితే షేక్ హసీనా ముందు ఈనెలలో తన అధికారం కోల్పోతుందని ప్రముఖ జ్యోతిష్యుడు హెచ్చరించాడట. ఇప్పుడు అదే నిజమైందన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
Hasina
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పతనం గురించి ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని చెప్పిన జోస్యం నిజమైంది. 15 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన షేక్ హసీనా సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. గతేడాది జ్యోతిష్కుడు ప్రశాంత్ కిని షేక్ హసీనాను మే, ఆగస్టు 2024 మధ్య "జాగ్రత్తగా" ఉండాలని హెచ్చరించాడట. అంతేకాదు తనపై హత్య ప్రయత్నం జరిగే అవకాశం ఉందని కూడా చెప్పాడట. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు వందశాతం నిజమయ్యాయని వార్తలు వస్తున్నాయి. హసీనా ఇప్పుడు దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. సోమవారం బంగ్లాదేశ్‌లో కలకలం, హింస దృశ్యాల మధ్య, జ్యోతిష్కుడు కిని గత సంవత్సరం చేసిన ట్వీట్ మళ్లీ తెరపైకి వచ్చింది. 2024 ఆగస్టులో షేక్ హసీనా ఇబ్బందుల్లో పడుతుందని నేను ముందే ఊహించాను' అని కిని సోమవారం ట్విట్టర్‌లో రాశారు.రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనా భారత్‌కు పారిపోయింది. ఆమె బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకర్-ఉజ్-జమాన్ దేశంలో సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
I have Already predicted Sheikh Haseena will be in trouble in August 2024 ,Is she flee her country !!!! https://t.co/WePWMaOOkP
— Prashanth Kini (@AstroPrashanth9) August 5, 2024