|| Image by freepic.diller on Freepik ||
ఈవార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ : తెలంగాణలో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం మంగళవారం నుంచి ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్తగా 6వ తరగతిలోకి ప్రవేశాలు కల్పించడంతో పాటు, 7-10 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను స్వీకరించి ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఫలితాలను మే 15న వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
అడ్మిషన్ టెస్ట్ షెడ్యూల్ వివరాలు:
నోటిఫికేషన్ : 09.01.2023
ఆన్‌లైన్ అప్లికేషన్లు : 10.01.2023 నుంచి 15.02.2023 వరకు
హాల్ టికెట్ డౌన్‌లోడ్ : 08.04.2023 నుంచి
పరీక్ష తేది : 16.04.2023 (ఆదివారం)
6వ తరగతితో ప్రవేశానికి పరీక్ష సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
7 - 10 తరగతుల్లో ప్రవేశానికి పరీక్ష సమయం : మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
పరీక్ష కేంద్రం : మండలాల్లోని స్కూళ్లు
మెరిట్ లిస్ట్ ప్రకటన : 15.05.2023
సెలక్షన్ లిస్ట్ ఎంపిక : 22.05.2023
సెలక్షన్ లిస్ట్ ప్రకటన : 24.05.2023
సర్టిఫికెట్ వెరిఫికేషన్ : 25.05.2023 నుంచి 31.05.2023 వరకు
తరగతులు ప్రారంభం : 01.06.2023 లేదా అకడమిక్ క్యాలెండర్‌ను అనుసరించి తరగతులు ప్రారంభం అవుతాయి.