తెలంగాణలో ఒక్కొక్కరు 10 లీటర్ల బీరు తాగేస్తున్నారు.. తాజా సర్వేలో సంచలన విషయాలు

తెలంగాణలో పండుగ అంటే బొక్క పీసు.. మందు చుక్క ఉండాల్సిందే. చాలా ప్రాంతాల్లోని ఫంక్షన్లలో ఇవి మినిమం ఉండాల్సిందే. ఇక.. మందు పార్టీలు, వీకెండ్ పార్టీలు సరేసరి. ఏదేమైనా తెలంగాణలో మద్యం ఏరులా పారుతోంది.

beer drinkers in telangana

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో పండుగ అంటే బొక్క పీసు.. మందు చుక్క ఉండాల్సిందే. చాలా ప్రాంతాల్లోని ఫంక్షన్లలో ఇవి మినిమం ఉండాల్సిందే. ఇక.. మందు పార్టీలు, వీకెండ్ పార్టీలు సరేసరి. ఏదేమైనా తెలంగాణలో మద్యం ఏరులా పారుతోంది. ఇదే ప్రభుత్వానికి కలసి వస్తోంది. ఒక రకంగా ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. రాష్ట్ర బడ్జెట్‌లో 120 శాతం ఆదాయం మద్యం వల్లే సమకూరుతోందంటే మద్యం ప్రియులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరో నిజం ఏంటంటే.. ప్రపంచంలో అమ్ముడయ్యే ప్రతి 3 విస్కీ బాటిళ్లలో హాఫ్ బాటిల్ ఒక్క హైదరాబాద్‌లోనే అమ్మడవుతోంది తెలుసా..! దీంతో తెలంగాణలో మద్యం వినియోగం ప్రమాదకరస్థాయిని దాటిపోయిందని ఆరోగ్య నిపుణులు భయపడుతున్నారు. ఈ స్థాయిని మోడరేట్ రిస్క్ అని బ్రిటిష్ మెడికల్ జర్నల్ చెప్తోంది.

డిస్టిలరీలు, బ్రూవరీల కోసం లిక్కర్ రేట్లు పెంచటానికి రాష్ట్రప్రభుత్వం ఈ మధ్యే ధరల నిర్ణయ కమిటీని నియమించింది. ఎక్సైజ్ కమిషనర్ సభ్యుడిగా ఉన్న ఈ కమిటీ.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో.. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళను మించి తెలంగాణలో లిక్కర్ సేల్ అవుతన్నట్లు తేలింది. తెలంగాణ జనాభా 3.5 కోట్లు అయితే నవంబర్ నాటికే రూ.35,589 కోట్ల లిక్కర్ అమ్మారు. అంటే.. తలసరి మద్యం వినియోగం 9 లీటర్లు అన్నమాట. బీర్ల విషయానికి వస్తే తలసరి 10.7 లీటర్లు. ఏపీ జనాభా 4.93 కోట్లు కాగా, నవంబర్ నాటికి ఆదాయం రూ.23,804 కోట్లు వచ్చింది. ఏపీలో తలసరి మద్యం వినియోగం 6.04 లీటర్లుగా ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్