TS EPASS : ఇంకా స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయలేదా.. గడువు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(ప్రతీకాత్మక చిత్రం)

ఈవార్తలు, తెలంగాణ: తెలంగాణ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను (PMS) దరఖాస్తు కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పొడిగించింది. తెలంగాణలో 2022-23 విద్యాసంవత్సరానికి పోస్ట్-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 15 నుంచి ప్రారంభమైనంది. రెన్యూవల్‌, కొత్తగా స్కాలర్‌షిప్‌ దరఖాస్తు కోసం ఈ-పాస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలనుకునే విద్యార్థులు తమ డేటాను అక్టోబర్ 16 లోపు దరఖాస్తు గడువు ముగియల్సింది కానీ, ఈ పక్రియను జనవరి 31 2023 వరకు పొడిగించింది. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతి (BC), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC), మైనారిటీలు, శారీరక వికలాంగ విద్యార్థుల ప్రయోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టింది.

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన  పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు‌దారులు క్వాలిఫైయింగ్ పరీక్ష మార్క్ షీట్‌తో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలకు సంబంధించి పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి. SC, STకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు, అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC, వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75 శాతంగా ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్