తెలంగాణ రైతులూ పంటలు జర భద్రం.. ఈ నెల 16 నుంచి వానలు కురుస్తాయట..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ రైతులు జర భద్రం.. యాసంగి పంట వేసిన ఈ టైంలో వానలు కురిసే అవకాశాలున్నాయట. వాతావరణ శాఖ ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది. ఈ నెల 16 నుంచి తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు, ఆగ్నేయం దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని వివరించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించి ఉండడంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఫలితంగా ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. 

ఈ నెల 16వ తేదీ తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయని వివరించింది. ఆ తర్వాత మళ్లీ ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. 16 నుంచి వానలు కురియనున్న నేపథ్యంలో పంటలు పాడయ్యే అవకాశాలున్నాయని వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్