||ఎన్టీఆర్ రూ.100 నాణేన్ని విడుదల చేస్తున్న రాష్ట్రపతి ముర్ము Photo: Facebook||
ఈవార్తలు, నేషనల్ న్యూస్ : భారతీయ సినీ చరత్రలో నటరత్న నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) ఎంతో ప్రత్యేకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నారని శ్లాఘించారు. ఎన్టీఆర్ శత జయంతి వేళ కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో సాంస్కృతిక కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఎన్టీఆర్ నటన అమోఘం అని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని వెల్లడించారు. ఎన్టీఆర్ విలక్షణమైన వ్యక్తి అని, ఆయనను ప్రజలు మర్చిపోరని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, మోహనకృష్ణ, రామకృష్ణ, కూతుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు, టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కింజారపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, మాజీ ఎంపీలు సుజనాచౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు హాజరయ్యారు.