||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, నేషనల్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ప్రభుత్వం 13వ విడత ఆర్థిక సాయం ఈ నెల 27 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కర్ణాటకలోని బెలగావిలో ప్రధానమంత్రి మోడీ విడుదల చేయ్యానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన ద్వారా సంవత్సరానికి 6 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇలా ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారు. అలాగే రైతులకు కావాల్సిన వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ ఇలా రైతులకు ఎన్నో కొత్త పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది.
తాజగా ప్రధానమంత్రి కుసుమ్ పథకాన్ని కూడా ప్రారంభించి రైతులకు సోలార్ పంపులను అమర్చుకునే సదుపాయాన్ని కేంద్రం ప్రభుత్వం కల్పిస్తోంది. రైతులకు విద్యుత్ శక్తితో నడిచే మోటర్లకు అధిక ఖర్చు అవుతుంది. కుసుమ్ యోజన పథకం ద్వారా సౌర శక్తి ఉపయోగించడం వలన రైతులకు తక్కువ ఖర్చుతో మంచి పంటలు పండిస్తారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అధికారిక వెబ్‌సైట్ https://www.india.gov.in/ ద్వారా కుసుమ్ యోజన పథకాలు ప్రయోజనాలు పొందవచ్చు.