LIC Jeevan Akshay : ఒకేసారి పెట్టుబడితో నెలకు రూ.20 వేల పింఛను

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


||ప్రతీకాత్మక చిత్రం|| ఇన్సూరెన్స్ చేయడానికి మంచి పాలసీ ప్లాన్ కోసం చూస్తున్నారా.. అయితే మన భారతదేశంలో పెద్ద పాలసీ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన ముందుకు కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఎల్ఐసీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పాలసీ కంపెనీల కన్నా ఎక్కువ వాటాను అర్జిస్తోంది. అలాగే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కన్నా ఎల్ఐసీ ప్రజల్లో భీమా రక్షణతోపాటు భారీ రాబడిని ఇచ్చే కంపెనీగా పేరుపొందింది. అయితే ఎల్ఐసీలో కొత్తగా వచ్చిన పాలసీ జీవన్ అక్షయ్.. అత్యుత్తమ పాలసీలలో ఒకటి. ఈ పాలసీలో ఒకేసారి డబ్బు చెల్లించడం ద్వారా ప్రతి నెలా రూ. 20,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఎల్ఐసీ పాలసీలలో జీవన్ అక్షయ పాలసీ కంపెనీ వద్ద డిపాజిట్ చేసిన మొత్తంపై నెలవారీ పెన్షన్‌ను అందించనుంది.

75 సంవత్సరాలు గల వ్యక్తి రూ.40 లక్షల 72 వేలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 20 వేల పెన్షన్ వస్తుంది. ఒకవేళ పెట్టుబడిదారుడు రూ.6 లక్షల 10 వేల 800 పెట్టుబడి పెడితే, ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ ద్వారా బీమా మొత్తం రూ.6 లక్షలు రావడంతో పెన్షన్‌గా రూ.76,650. అంటే 6 నెలలకు రూ.37000 అవుతుంది. ఈ పాలసీ ద్వారా ఆ వ్యక్తి జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. దీనితోపాటు పాలసీదారునికి పాలసీ ప్రారంభించిన 90 రోజుల తర్వాత లోను కూడా అప్లై చేసుకుని అవకాశం ఉంది. పాలసీ ద్వారా సంవత్సరానికి కనీసం 12000 రూపాయలు పెన్షన్ పొందడంతో పాటు ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పాలసీ కనీస పెట్టుబడి ఒక లక్ష.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్