ఇంకా తగ్గని కరోనా ప్రభావం.. 2022లో ఇప్పటికే 10 లక్షలు దాటిన మరణాలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(ప్రతీకాత్మక చిత్రం)

2019లో తొలిసారి చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్.. గత మూడేండ్లలో లక్షల ప్రాణాలను బలి తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 64.5 లక్షల మంది కరోనాతో మరణించారు. 2022లోఆగస్టు 25 నాటికి 10 లక్షల మంది చనిపోయినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అత్యధికంగా అమెరికాలో 2,17,627 మంది కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో 72,556, బ్రెజిల్‌లో 63,866, భారత్‌లో 45,786, యూకేలో 27,251 మంది మరణించారు. ఈ మరణాలపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్ డాక్టర్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిని మరింత తగ్గించేందుకు అన్ని దేశాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

చాలా దేశాలు కరోనాను లైట్ తీసుకొని ఆంక్షలు ఎత్తివేశాయని, దాని ప్రభావంతో ఈ ఏడాది మరణాలు ఇప్పటికే 10 లక్షలకు చేరాయని టెడ్రోస్వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతున్న విషయాన్ని అన్ని దేశాలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో ప్రభావం చూపిందని గుర్తు చేశారు. మాస్కులు, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని, వ్యాక్సిన్, బూస్టర్ డోస్ కచ్చితంగా వేసుకోవాలని చెప్పారు. కరోనా టెస్టులు తగ్గటం వల్ల కేసుల సంఖ్య సరిగా తెలియటం లేదని పేర్కొన్నారు. 

దేశాల వారీగా కొవిడ్ మరణాలు (2022):

అమెరికా 2,17,627

రష్యా 72,556

బ్రెజిల్‌ 63,866

భారత్‌ 45,786

ఇటలీ 37,614

జర్మనీ 34,894

ఫ్రాన్స్ 29,960

మెక్సికో 29,764

యూకే 27,251 

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు:

2022 10 లక్షలు

2021 36 లక్షలు

2020 19 లక్షలు

భారత్‌లో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే.. (ఆగస్టు 27, ఉదయం 8 గంటల వరకు)

యాక్టివ్ కేసులు 87,311

డిశ్చార్జి కేసులు 4,37,83,788

మరణాలు 5,27,597

మొత్తం వ్యాక్సినేషన్ 2,11,39,81,444


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్