ఇంట్లో హనుమంతుడి ఫొటో పెట్టుకొంటున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇంటికి శ్రేయస్కరం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| పంచముఖ ఆంజనేయ స్వామి, Photo: Twitter ||

ఇంట్లో హనుమంతుని విగ్రహం గానీ, ఫోటో గానీ ఏ దిక్కున పెట్టుకోవాలి.. ఏ దిక్కున పెడితే మంచి జరుగుతుంది. అసలు ఎలాంటి దిక్కులో పెట్టకూడదు. హనుమంతుని ఫోటో ఇంట్లో ఉంటే ఎలాంటి నియమాలను పాటించాలి. ఇంట్లో అంతా మంచి జరగడానికి ఎలాంటి హనుమంతుని ఫోటో పెట్టుకోవాలి. అనే సందేహాలు అందరిలో ఉంటాయి. అయితే ఏ దిశలో పెట్టుకోవాలి. ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలో తెలుసుకుందాం..

హనుమంతుని విగ్రహం, ఫోటోని ఏ దిశలో ఉంచుకోవాలి : 

వాస్తు దోషాలకు, వాస్తు ప్రకారం దక్షిణ దిశలో హనుమంతుని విగ్రహం లేదా ఫోటో ఉంచుకోవడం ప్రయోజకం. అలాగే కూర్చుని ఉన్న హనుమంతుని విగ్రహం లేదా ఫోటోను ఈ దిశలోనే ఉంచాలి. హనుమంతుని విగ్రహం ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. ఉత్తర దిశలో హనుమంతుని విగ్రహం ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఆయుష్షు ఆనందాలతో, సంపదలు చేకూరుతాయని, మనిషి కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. పంచముఖ హనుమంతుని చిత్రం పెట్టుకోవడానికి దక్షిణ దిశను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే పర్వతాన్ని ఎత్తుకున్న హనుమంతుని ఫోటో ఇంట్లో ఉండటం వల్ల ఆ కుటుంబానికి ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనే  సామర్థ్యం ఉంటుందన్న నమ్మకం. ఎరుపు రంగులో కూర్చుని ఉన్న హనుమంతుని ఫోటో గాని విగ్రహం గానీ దక్షిణ వైపు ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. 

ఇంట్లో హనుమంతుని విగ్రహం లేదా ఫోటో ఉంటే ఎలా పూజించాలి :

హనుమంతుని ఫోటో కానీ విగ్రహం కానీ ఎల్లప్పుడు శుభ్రంగా ఉండాలి పరిసర ప్రాంతాలు కూడా దుమ్ము దులి లేకుండా ఉండాలి.క్రమం తప్పకుండా ప్రతిరోజు పూజ చేయాలి. హనుమాన్ విగ్రహం ఉన్న ఇంట్లో ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలి అలాగే మధ్యాహ్న సమయంలో విగ్రహానికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రపటాన్ని కానీ విగ్రహం గానీ మెట్ల కింది భాగంలో, వంట గదిలో ఆ పవిత్రమైన ప్రదేశాల్లో ఉండకూడదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్