Himanshu Golden Hour | సింగర్‌గా మారిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. ప్రొఫెషనల్ సింగర్‌లా పాడి..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||హిమాన్షు కల్వకుంట్ల, కేటీఆర్||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు రావు సింగర్‌గా మారాడు. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ కొడుకుగా అద్భుతంగా పాడి శ్రోతలను మైమరిపించాడు. పాటకు సంబంధించిన వీడియోను హిమాన్షు శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశాడు. గోల్డెన్ అవర్ అనే సాంగ్‌ను హిమాన్షు పాడాడు. ఒక అబ్బాయి తన ప్రేయసి అందాన్ని పొగుడుతూ ఉండే లిరిక్స్‌ను ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టే పాడాడు. పాట విన్నంత సేపు నిజంగా హిమాన్షే పాడాడా? ప్రొఫెషనల్ సింగర్ పాడాడా? అన్న ఆశ్చర్యం కలగక మానదు. తాత కేసీఆర్ పుట్టిన రోజున ఈ పాట విడుదల చేయటంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తాతకు మంచి గిఫ్ట్ ఇచ్చావంటూ కొనియాడుతున్నారు.

కాగా, దీనికి సంబంధించిన లింక్‌ను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి సంబరపడిపోయారు. హిమాన్షు కవర్ సాంగ్ పాడాడని, చాలా గర్వంగా ఫీలవుతున్నానని వెల్లడించారు. తాను ఎంజాయ్ చేశానని, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నట్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ లైక్‌లు, ట్వీట్లతో హోరెత్తుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్