Indian Railways : రైళ్లలో RAC రూల్స్ తెలుసా.. తెలియకపోతే తోటి ప్రయాణికులతో గొడవే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(PIC: ప్రతీకాత్మక చిత్రం)

ఈవార్తలు: రైళ్లలో RAC సీటు గురించి తెలుసా? ఈ సీటు కేటాయింపు వెనకాల ఓ మతలబు ఉందన్న విషయమూ తెలుసా? తెలియకపోతే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేకపోతే మన సీట్లో వేరేవాళ్లు కూర్చొన్నా మనం ఏం చేయలేని పరిస్థితి. అసలేంటీ RAC సీటు అంటే.. Reservation Against Cancellation. అంటే.. సీటు దొరుకుతుంది. కానీ, ఏ బెర్తు అన్నది రైలు ప్రయాణించే మూడు గంటల ముందే తెలుస్తుంది. రైలు బయలుదేరే 3 గంటల ముందు చార్టు ప్రిపేర్ చేస్తారు. ఆ సమయంలో బెర్తును కేటాయిస్తారు. ఆర్ఏసీ కింద బెర్తు ఇచ్చేవాళ్లకు సైడ్ లోవర్ బెర్త్‌నే ఇస్తారు. ఇక్కడ ఓ మతలబు ఉంది. ఈ బెర్తును ఇద్దరికి కూడా కేటాయించే అవకాశాలుంటాయి. అంటే.. రైల్వే శాఖ ఒకరి టికెట్ డబ్బులు ఎక్స్‌ట్రా సంపాదించుకొన్నట్టే. ఉదాహరణకు సైడ్ లోవర్ బెర్తు నంబరు 55, సైడ్ అప్పర్ బెర్త్ నంబర్ 56 అనుకుందాం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సైడ్ అప్పర్ బెర్త్ ప్రయాణికుడు సైడ్ లోవర్ బెర్తులో కూర్చోవడానికి అధికారం ఉంది. ఇక్కడ సైడ్ లోవర్ బెర్త్‌లో రెండు సీట్లు ఉంటాయి. అందులో ఒకదానికి 56 నంబర్ అని రాసి ఉంటుంది. ఆ సీటు రాత్రి 9 గంటల వరకు సైడ్ అప్పర్ బెర్త్ ప్రయాణికుడిదే.

55 నంబర్ అని ఉన్న సీట్లో RAC కింద టికెట్ కన్‌ఫాం అయిన ఇద్దరు వ్యక్తులు సర్దుకోవాలి. అలాగని, సైడ్ అప్పర్ బెర్త్ ప్రయాణికుడిని తన బెర్త్ మీదికి పోవాలని అడిగే అధికారం ఉండదు. ఒక సీటులో ఇద్దరు కూర్చోవాల్సిందే. రాత్రి 9 గంటల తర్వాతే సైడ్ అప్పర్ బెర్త్ ప్రయాణికుడిని తన బెర్త్‌కు వెళ్లాలని అడగొచ్చు. ఆ సమయంలో సైడ్ లోవర్ బెర్త్ ప్రయాణికులకు అధికారం ఉంటుంది. రాత్రి అయ్యాక కూడా.. సైడ్ లోవర్ బెర్త్ ప్రయాణికులు ఇద్దరు ఆ సీటును సర్దుకోవాలి. అంటే.. రెండు సీట్లకు రైల్వే శాఖ ముగ్గురి ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుందన్న మాట. ఇలా RAC రూల్స్ తెలియకుండా రైలు ఎక్కామో.. ఇది నా సీటు అంటే.. నా సీటు అని గొడవ పెట్టుకోవటం తథ్యం. అందుకే, RAC కింద సీటు కేటాయిస్తే రైలు ప్రయాణం చేసేప్పుడు కచ్చితంగా ఈ రూల్ తెలిసి ఉండాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్