మహాశివరాత్రి రోజు చేయాల్సిన పూజావిధానం ఇదీ.. ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| శివలింగం||

మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్ధశి నాడు మహాశివరాత్రిగా ధర్మసింధు వంటి శాస్త్రగంద్ర గ్రంథాలు తెలుపుతోంది. ఈ పండుగను చతుర్థశి రాత్రి పూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు శివుని లింగస్వరూపంలో జ్యోతి స్వరూపుడై భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. ఈరోజు మహా శివుని భక్తిశ్రద్ధలతో చేసి జాగారం, అభిషేకం చెయడం వలన పాపాలన్ని తొలగిపోయి శివుని అనుగ్రహం పొందుతారని నమ్మకం. ఈ రోజున శివునికి ఉపవాసం ఉండడం, రాత్రి జాగారం చేయటం, శివనామ స్మరణ, శివ స్తోత్రం, శివ అష్టోత్తరం, అభిషేకాలు చేయుట వలన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది.

 మహాశివరాత్రి రోజు ఏం చేయాలి ?

మహాశివరాత్రి నాడు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి, ఇల్లంతా శుభ్రపరచుకొని, వాకిళ్లలో కల్లాపి చల్లి, ముగ్గులు పెట్టుకుని శూచిగా తల స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసి, పూజ గదిలో దేవునికి కావలసిన వస్తువులను ఏర్పాటు చేసుకొని, దేవుని పటాలు, విగ్రహాలను శుభ్రపరచుకొని అలంకరించి, పూలను సమర్పించాలి. పూజ గది, ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టుకొని, గడప కి ముగ్గులు పెట్టి అలంకరించుకోవాలి. 

మహాశివరాత్రి కావలసిన వస్తువులు ?

గంగాజలం(రోజ్ వాటర్), ఆవు పాలు, శివలింగం, శివ పటం,  పంచామృతాలు( పాలు,పెరుగు,తేనె,పంచదార, నెయ్యి) పుష్పాలు, మారేడు దళాలు, బిల్వపత్రాలు, తుమ్మిపూలు, గోగుపూలు, తెల్లని పువ్వులు, పచ్చని పువ్వులు, తాంబూలం, చిలకడదుంప ( స్వీట్ పొటాటో), అరటి పండ్లు, ఖర్జూర పండ్లు, జామ పండ్లు, మట్టి ప్రమిదలు 2, పత్తి వత్తులు, కలశం, కర్పూరం, సింధూరం, విభూతి, హారతి పళ్లం, దేవుని పటం ఉంచేందుకు తెల్లటి వస్త్రం.

మహాశివరాత్రి పూజా విధానం :

మహాశివరాత్రి ఉదయం ప్రాత:కాలం నుండి ఉదయం 9 గంటల లోపు రోజ్ వాటర్ తో శివలింగాన్ని అభిషేకించి, అనంతరం పంచామృతాలతో అభిషేకం చేయాలి. అభిషేక సమయంలో శివ అష్టోత్తరం/పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ.. అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉండి తర్వాత సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివ నామాలను,శివపురాణం చదువుతూ జాగారం చేయాలి ఇలా చేయడం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో, విశేష శుభఫలితాలు పొందుతారు. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో శివున్నిఅభిషేకం చేయడం వల్ల పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మహా శివునికి నైవేద్యాలు, అన్నం కూరలు సమర్పించి ఉపవాసం విరమణగావించాలి. గుడికి వెళ్లి గోమాతకు మూడు ప్రత్యక్షణాలు చేసి గోమాతకు తినేందుకు ఆహారం తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి. తరువాత మీ స్తోమత బట్టి పేదవారికి అన్నదానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మహాశివుడు తమ పిల్లలను రక్షించుకునే తల్లిలా ఎప్పుడు భక్తులను రక్షిస్తూ వారి కోరికలను తీరుస్తూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల గ్రహదోష నివారణ జరిగి కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుంది. 

శివరాత్రి రోజు చేయకూడని పనులు ఏంటి ?

 శివలింగానికి తులసి ఆకులు సమర్పించకూడదు. 

ఆవు పాలుతో మాత్రమే అభిషేకం చేయాలి. ప్యాకెట్ పాలతో అభిషేకం చేయకూడదు. 

శివలింగానికి అభిషేకం చేస్తుంటే శివ అక్కడనే చేస్తూ ఉండాలి ఇతరుల ప్రస్తావన తీసుకురాకూడదు. 

శివలింగాన్ని పురుషులు మాత్రమే అభిషేకం చేయాలి. స్త్రీలు అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని తాకకూడదు.

శివలింగానికి మన నుండి వెలువడే చెమట, వెంట్రుకలు పడకుండా జాగ్రత్త వహించాలి. 

ఈరోజు మాంసం, మద్యానికి దూరంగా ఉంటే మంచిది.

ఇతరులను దూషించుట, అసభ్యంగా మాట్లాడుట చేయకూడదు. ఈరోజు చిన్న చీమ కైనా కానీ హాని చేయకూడదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్