Great Wall of China: గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూసేందుకు పోటెత్తిన జనం ..వైరల్ వీడియో

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూసేందుకు జనం పోటెత్తారు. పొడవైన ఈ వాల్ పై జనం చీమల కుప్పల మాదిరే కనిపిస్తున్నారు. ఈ విజువల్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Great Wall of China

ప్రతీకాత్మక చిత్రం 

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా..ప్రపంచ వింతల్లో ఏడవదిగా చదువుకుంటున్నాము. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన గ్రేట్ వాల్‌ని చూసేందుకు ఇటీవల భారీగా జనం తరలివచ్చారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే అతి పొడవైన గ్రేట్ వాల్ కూడా. సహజంగానే, ప్రతి సంవత్సరం, ఈ ప్రదేశం యొక్క అందాలను చూసేందుకు లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఇటీవల, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై వేలాది మందిని చూపించే క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కానీ ఈ వీడియోలో వారసత్వ ప్రదేశం చుట్టూ జనాలు తిరుగుతుంటే..వీడియో లో చీమల వలే కనిపించారు. చెన్ అనే బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పేజీలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై పర్యాటకుల గుంపు వీడియోను షేర్ చేశాడు.

ఈ గ్రేట్ వాల్ ఎక్కే వ్యక్తులతో క్లిప్ ప్రారంభమవుతుంది. తరువాత, గ్రేట్ వాల్  మొత్తం విస్తీర్ణం ప్రజలతో ఎలా కిక్కిరిసిపోయిందో..చీమలు పాకుతున్నట్లుగా ఎలా ఉంటుందో చూపించడానికి కెమెరా ప్యాన్ చేస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ని చూడటానికి ప్రజలు ఎలా క్యూలో నిల్చున్నారో చూడవచ్చు.గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'ను చూసేందుకు జనం గుమిగూడిన దృశ్యాన్ని చూసి సహజంగానే నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక సోషల్ మీడియా యూజర్ ఆశ్చర్యపోయాడు, "అంత పొడవైన క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఎవరికైనా అత్యవసరంగా టాయిలెట్ అవసరమైతే మీరు ఏమి చేస్తారు?" అంటూ కామెంట్ చేశాడు. నెటిజన్లు ఈ వీడియో పై రకరకాల కామెంట్ల్ జోడించారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 21,196 కిలోమీటర్లు విస్తరించి ఉంది. హెరిటేజ్ సైట్ అనేక గోడలు 7వ శతాబ్దంలో నిర్మించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్