ఇంట్లో ఏనుగుల బొమ్మలు ఉంటే అదృష్టమా.. ఎలాంటి ఏనుగు బొమ్మలు ఉండాలంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| ప్రతీకాత్మక చిత్రం ||

ఈవార్తలు, లైఫ్‌స్టైల్: ఇంట్లో ఏనుగుల బొమ్మలు ఉండటం శుభసూచకమని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఇంట్లో ఏనుగుల బొమ్మలు ఉండటం వల్ల సంతానోత్పత్తికి, శుభాలకి శత్రువులను ఎదుర్కొనే శక్తి కలుగుతుందని నమ్మకం. ముఖ్యంగా ఏనుగు తొండం పైకి ఎత్తినట్టు ఉండటం వల్ల ఇంట్లో అంతా అదృష్టం కలిసి వస్తుంది. ఇంటి ముఖ ద్వారం వద్ద ఏనుగుల బొమ్మలు ఉంచినట్లయితే దుష్టశక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. పురాతన కాలంలో దేవాలయాల్లో ప్రవేశద్వారం ముందు ఏనుగుల బొమ్మలు ఉంటాయి. చెడు శక్తులను దుష్టశక్తులను లోపలికి రానీయకుండా కాపాడతాయి. తలుపు పైన ఉన్న ఏనుగు ఒక జత అదృష్టం, రక్షణ, బలాన్ని తెస్తుందని నమ్ముతారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు : 

తమ బెడ్ రూమ్ లో రెండు ఏనుగులు జతగా ఉన్న ఫోటోను పెట్టడం వల్ల భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరిగి మంచి సంతానం అభివృద్ధిలో ఉంటుంది. పడక గది యొక్క నైరుతి మూలలో ఏనుగులను ఉంచడం ద్వారా ప్రేమ సంబంధాన్ని పెరుగుతాయి. 

పిల్లలకు మంచి జ్ఞానం కలగడానికి : 

పిల్లల రూములో, పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ పైన ఏనుగు బొమ్మని పెట్టడం వల్ల పిల్లల విజ్ఞానం పెరుగుతుంది అలాగే జ్ఞాపకశక్తి వస్తుంది భవిష్యత్తులో పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. పెద్దఏనుగు దాన్ని పిల్ల గున్న ఏనుగుతో కలిసి ఉన్న బొమ్మ పెట్టడం పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులు లకు ఇబ్బంది కలగకుండా మనోవేదనకు గురికాకుండా తల్లి పిల్లల మధ్యల మంచి బంధాలు ఏర్పడతాయి. పిల్లలకు జ్ఞానాన్ని, విద్యా విజయాన్ని అందించడానికి ఇది మంచి చిహ్నం.  

మంచి ఉద్యోగం కీర్తి పేరు ప్రతిష్టల కోసం : 

ఏనుగు పై కోతి కూర్చొని ఉన్న బొమ్మని కానీ ఫోటోని గాని ఇంట్లో గాని వ్యాపార స్థలాల్లో కానీ ఉంచడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు ఉద్యోగంలో ప్రమోషన్లు మంచి అభివృద్ధిలో ఉంటారు. హౌస్ వార్మింగ్ ఫంక్షన్, వార్షికోత్సవం సందర్భంగా బహుమతులు ఇవ్వడానికి అద్భుతమైనది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్