(ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్ : Cricket Asia Cup | మినీ వరల్డ్ కప్.. ఆసియా కప్‌నకు రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ నెల 27 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ దుబాయ్‌లో శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ మధ్య సాయంత్రం 5.30 గంటలకు మొదలవుతుంది. ఆ మరుసటి రోజే దాయాది దేశాలు భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. టీమిండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. భారత్ అత్యధికంగా ఏడు సార్లు ఆసియా కప్‌ను గెలుచుకొంది. ఒక్కో టీమ్ వారీగా చూస్తే భారత్ బలంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ ఏం సంచలనం నమోదు చేస్తుందో చెప్పలేం. బంగ్లా దేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఆర్థికంగా దివాళా తీసిన శ్రీలంక కూడా బరిలోకి దిగుతోంది. ఆ జట్టు సమష్టిగా రాణించాలని ప్రతీ ఒక్కరు కోరుకొంటున్నారు. ఒకప్పటి శ్రీలంక జట్టుగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లు ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
ఆసియాకప్ భారత్‌దే: షేన్ వాట్సన్
ఆసియా కప్ భారత్‌దేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ తెలిపాడు. ఆ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉందని, దుబాయ్ పరిస్థితులు టీమిండియాకు అనుకూలిస్తాయని వెల్లడించాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్ టాపార్డర్ దుర్భేద్యంగా ఉందని వివరించాడు. భారత్, పాక్ మ్యాచ్‌పై మాట్లాడుతూ, ఈ మ్యాచ్ చూసేందుకు ఉత్సుకతతో వేచి చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ఆసియా కప్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.
ఆసియా కప్ షెడ్యూల్ ఇదే..
తేదీ జట్లు ప్రదేశం సమయం
ఆగస్టు 27 శ్రీలంక X అఫ్ఘనిస్థాన్ దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
ఆగస్టు 28 పాకిస్థాన్ X భారత్ దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
ఆగస్టు 30 బంగ్లాదేశ్ X అఫ్ఘనిస్థాన్ షార్జా సాయంత్రం 5.30 గంటలకు
ఆగస్టు 31 భారత్ X క్వాలిఫయర్ దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
సెప్టెంబర్ 1 శ్రీలంక X బంగ్లాదేశ్ దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
సెప్టెంబర్ 2 పాకిస్థాన్ X క్వాలిఫయర్ షార్జా సాయంత్రం 5.30 గంటలకు
సెప్టెంబర్ 3 బీ1 X బీ2 షార్జా సాయంత్రం 5.30 గంటలకు
సెప్టెంబర్ 4 ఏ1 X ఏ2 దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
సెప్టెంబర్ 6 ఏ1 X బీ1 దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
సెప్టెంబర్ 7 ఏ2 X బీ2 దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
సెప్టెంబర్ 8 ఏ1 X బీ2 దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
సెప్టెంబర్ 9 బీ1 X ఏ2 దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
సెప్టెంబర్ 11 ఫైనల్ దుబాయ్ సాయంత్రం 5.30 గంటలకు
ఆసియాకప్ జట్లు ఇవే:
గ్రూప్-ఏ
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.
పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాబాద్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిదీ, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదర్.
హాంకాంగ్: యూఏఈతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హాంకాంగ్ గెలిచి, ఆసియాకప్‌కు అర్హత సాధించింది. ఈ జట్టును ఇంకా ప్రకటించలేదు.
గ్రూప్-బీ
ఆఫ్ఘనిస్థాన్: మహ్మద్ నబీ (కెప్టెన్), నజీబుల్లా జార్దాన్ (వైస్ కెప్టెన్), అఫ్సర్ జజాయ్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, ఫరీద్ అహ్మద్, ఫజల్ హక్ ఫరూకీ, హష్మతుల్లా షాహిదీ, హజ్రతుల్లా జజాయ్, ఇబ్రహీం జార్దాన్, కరీం జనత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నజీబుల్లా జార్దాన్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, రహ్మనుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్, షమీయుల్లా షిన్వారీ.
బంగ్లాదేశ్: షకీబుల్ హసన్ (కెప్టెన్), అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహమాన్, నసుమ్ అహ్మద్, సబ్బీర్ రహమాన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబడోత్ హుస్సేన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నూరుల్ హసన్ సోహాన్, టాస్కిన్ అహ్మద్.
శ్రీలంక: దసున్ శనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, నిశాంఖ, కుశాల్ మెండిస్, చరిత అసలంక, భనుక రాజపక్సే, బండార, ధనంజయ డిసిల్వ, వానిందు హసరంగ, మహీశ్ తీక్షణ, జెప్రీ వాండర్‌సే, ప్రవీణ్ జయవిక్రమ, చమిక కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, మతీశ్ పతీరణ, ఫెర్నాండో, దుష్మంత్ చమీరా, దినేశ్ చండిమల్.
ఆసియా కప్ విజేతల లిస్ట్:
సంవత్సరం విజేత
1984 భారత్
1986 శ్రీలంక
1988 భారత్
1990-91 భారత్
1995 భారత్
1997 శ్రీలంక
2000 పాకిస్థాన్
2004 శ్రీలంక
2008 శ్రీలంక
2010 భారత్
2012 పాకిస్థాన్
2014 శ్రీలంక
2016 భారత్
2018 భారత్
2022 --