Marriage Age | వివాహ వయసు పెంపుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

వివాహానికి స్త్రీ, పురుషులకు కనీస వయసు ఒకేలా ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ అంశం తమ పరిధిలోనిది కాదని, పార్లమెంట్ మాత్రమే తేల్చే అంశమని స్పష్టం చేసింది. కోర్టులు చట్టాలు చేయలేవని తేల్చి చెప్పింది. స్త్రీ, పురుషుల వివాహ వయసుపై న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. దేశంలో ప్రస్తుతం పెళ్లి చేసుకునే వయసు మగవారికి 21 ఏళ్లుగా, స్త్రీలకు 18 ఏళ్లుగా ఉన్నదని, ఇది మహిళలపై వివక్ష చూపడమేనని పిటిషనర్ వాదించారు. మహిళల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచాలని కోరారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం.. చట్టం చేయాలని పార్లమెంట్‌ను ఆదేశించలేమని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్