జనవరిలో ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్.. ఆ తేదీలు నోట్ చేసుకొని పెట్టుకోండి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, బిజినెస్ : జనవరిలో బ్యాంకు క్యాలెండర్ ప్రకారం 30, 31 తేదీల్లో సెలవులు లేవు. కానీ, బ్యాంకులు ఆ రోజు బంద్ కానున్నాయి. ఎందుకంటారా? ఆ రెండు రోజుల్లో సమ్మెకు దిగుతున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ప్రకటించింది. బ్యాంక్ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని దినాలను అముల చేయాలని కోరుతూ ఈ యూనియన్ సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించింది. తమ డిమాండ్‌పై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఏ చర్యలు తీసుకోనందున సమ్మెకు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆలిండియా బ్యాంక్ యూనియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటాచలం వెల్లడించారు. ఐదు రోజుల పనిదినాలే కాకుండా, పెన్షన్ అప్‌డేషన్, వేతన సవరణ, అన్ని కేడర్లలో నియామకాలు సహా పలు డిమాండ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. 


ఈ నేపథ్యంలో జనవరి 30, 31 తేదీల్లో సమ్మె ఉంటే.. ఆ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ తేదీలను గుర్తుంచుకొని ఆ రోజుల్లో ప్రజలు బ్యాంకు పనులు పెట్టుకోవద్దని సూచించారు. ఆ రోజుల్లో ఏటీఎంలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. అందుకే ముందు జాగ్రత్తగా బ్యాంకు లావాదేవీలను పూర్తి చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమో చేయాలని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్