|| బంగ్లాదేశ్ యువతి కృష్ణమండల్ (22), Photo: Instagram ||
ప్రేమ.. రాసేందుకు, పలికేందుకు రెండక్షరాల పదమే! కానీ దాని ప్రభావం మాత్రం విశ్వమంత గొప్పది! ఒక్కసారి ప్రేమ పుట్టిందంటే చాలు దానికి కులం, మతం, జాతీ, వర్ణం, వర్గం, దేశం వంటి భేదాలేవీ ఉండవు. మనసిచ్చినవారి కోసం ప్రేమికులు ఎంత దూరం వెళ్లేందుకైనా వెనుకాడారు. దారిలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా వాటిని దాటుకుంటూ ముందుకు సాగాతారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే బంగ్లాదేశ్, భారత సరిహద్దుల్లో వెలుగుచూసింది. ఆ వివరాలేంటో మీరూ చదివేయండి..!
ఈ వార్తలు, కోల్‌కతా: ప్రేమను మించిన శక్తి ప్రపంచంలోనే మరొకటి లేదని బంగ్లాదేశ్ యువతి నిరూపించింది. మనసిచ్చిన చెలికాడి కోసం పాస్‌పోర్ట్, వీసా లేకుండా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకుంది. ఈ క్రమంలో దట్టమైన అడవులు, కూృరమృగాలు సంచరించే మడ అడవులు, మట్లా నది, ప్రమాదకరమైన బురద నేలలు దాటుకుంటూ ఆమె ప్రియుడి దరికి చేరింది. బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏళ్ల కృష్ణ మండల్‌కు భారత్‌కు చెందిన అభిక్ మండల్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. సామాజిక మాధ్యమం వేదికగా ప్రేమ ఊసులు చెప్పుకున్న వీరిద్దరి మనసులు ఏకమయ్యాయి. ఇంకేముందు తన ప్రియుడిని కలిసేందుకు భారత్ రావాలని కృష్ణ నిశ్చయించుకుంది. ప్రేమికుడిపై అపారమైన నమ్మకం.. అంతులేని ప్రేమైతే ఉంది కానీ.. అతడి దరికి చేరడం ఎలా అని చాలా ఆలోచించింది. చూస్తూ కూర్చుంటే లాభం లేదనుకున్న ఆ యువతి.. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి.. భారత్ బాట పట్టింది.
కూృర మృగాలు సంచరించే సుందర్బన్ అడవులకు అవతల నివాసముండే కృష్ణ మండల్.. తన ప్రియుడిని త్వరగా చేరుకోవాలనంటే ఈ అడవి దాటక తప్పదని సంకల్పించుకుంది. తగినంత డబ్బు లేకపోవడంతో నడక ప్రారంభించిన కృష్ణ మండల్.. రాయల్ బెంగాల్ టైగర్స్‌కు పుట్టినిౖల్లెన అడవులను ఆత్మౖస్థెర్యంతో దాటింది. ఆమె దారిలో అత్యంత ప్రమాదకరమైన ‘మాట్లా’ నది ఎదురుకాగా.. ప్రాణాలకు తెగించిన కృష్ణ మండల్.. గంటపాటు నదిలో ఈదుతూ ఒడ్డుకు చేరింది. ఈ క్రమంలో బురద నేలలు, కూృరమృగాల వంటి ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ చివరికి భారత్‌లో అడుగుపెట్టిన కృష్ణా మండల్.. పశ్చిమ బెంగాల్‌లోని ‘24 పరగణా’ జిల్లాలోని తన ప్రియుడు అభిక్ మండల్ ఇంటికి చేరుకుంది.
ఈ పరిణామంతో ఒక్కసారి షాక్‌కు గురైన అభిక్.. ప్రేయసిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. తన ప్రేమ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదులు, సముద్రాలు, అడవులు దాటుకుంటూ వచ్చిన ప్రేయసిని అభిక్ పెళ్లాడాడు. కోల్‌కతాలోని కాలీఘాట్‌లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. సినిమా స్టోరీని తలపించిన ఈ ఇద్దరి ప్రేమ కథ చివరికి సుఖాంతమైంది. ప్రేమ పవర్ ఏంటో ప్రపంచానికి చాటిన కృష్ణ మండల్ సాహసంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సంకల్ప బలం ముందు ఎలాంటి అడ్డంకులైనా చిన్నవేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ప్రాణాలకు తెగించడం సరైన పద్ధతి కాదని ఆ అమ్మాయి తీరును తప్పుపడుతున్నారు. మరికొంత మంది ఆమెను ఒలింపిక్స్‌కు పంపితే మేలని సలహా ఇస్తున్నారు.