||ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ Photo: Twitter||
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్లను నియమించారు. పలు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించగా, పలువురిని బదిలీ చేశారు. వీరిలో ఆరుగురు కొత్తవారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈయన అయోధ్య తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడు. మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో రమేశ్ బైస్‌ను నియమించారు. లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మథుర్ రాజీనామాను కూడా ఆమోదించి, కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్‌కు జస్టిస్ అబ్దుల్ నజీర్, ఛత్తీస్‌గఢ్‌కు విశ్వభూషణ్ హరిచందన్, మహారాష్ట్రకు రమేశ్ బైస్, హిమాచల్‌ప్రదేశ్‌కు శివ్‌ప్రతాప్ శుక్లా, అరుణాచల్‌ప్రదేశ్‌కు లెఫ్ట్‌నెంట్ జనరల్ కైవల్య తివికమ్ పర్నాయక్, సిక్కింకు లక్ష్మణ్ పసాద్ ఆచార్య, జార్ఖండ్‌కు సీపీ రాధాకృష్ణన్, అస్సాంకు గులాబ్‌చంద్ కటారియా, మణిపూర్‌కు అనుసూయ, నాగాలాండ్‌కు గణేశన్, మేఘాలయాకు ఫాగు చౌహాన్, బీహార్‌కు రాజేంద్ర విశ్వనాథ్, లఢఖ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీడీ మిశ్రాను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.