Anant Ambani Gift : సెలబ్రిటీలకు అనంత్ అంబానీ రూ.2 కోట్ల విలువైన గిఫ్ట్

బాలీవుడ్ నటులతో పాటు తన దగ్గరి అత్యంత ఆప్తులకు రూ.2 కోట్ల విలువైన లగ్జరీ వాచ్‌లను అనంత్ అంబానీ గిఫ్ట్‌గా ఇచ్చాడు.

anant ambani

ప్రతీకాత్మక చిత్రం

Anant Ambani - Radhika Merchant Marriage : రిలయన్స్ అధినే ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ వేడుక.. శుక్రవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ - జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో రాధిక మర్చంట్ మెడలో అనంత్ అంబానీ మూడు ముళ్లు వేయడంతో పెళ్లి తంతు పూర్తయ్యింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. యావత్తు సినీ, క్రీడాలోకం వీరి పెళ్లిలో సందడి చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటులతో పాటు తన దగ్గరి అత్యంత ఆప్తులకు రూ.2 కోట్ల విలువైన లగ్జరీ వాచ్‌లను అనంత్ అంబానీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ వాచ్ Audemars Piguet Royal Oak Perpetual Calendar లిమిటెడ్ ఎడిషన్ వాచ్ అని తెలుస్తోంది. పలువురు ఆ వాచీలు ధరించి దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వాచీలను ధరించి సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ తదితరులు ఫొటోలను పోజులిచ్చారు.

41 ఎంఎం 18కే రోజ్ గోల్డ్ డయల్ కలర్, డార్క్ బ్లూ సబ్ డయల్స్, 20 మీటర్ వాటర్ రెసిస్టెన్స్ కలిగిన ఈ వాచీ రిటైల్ ధర 1,05,000 డాలర్లు (87,69,000 రూపాయలు) కాగా, మార్కెట్ ధర 2,50,000 డాలర్లు (2,08,79,000 రూపాయలు). మొత్తంగా 25 వాచీలను అనంత్ అంబానీ కొనుగోలు చేసినట్లు తెలిసింది. కాగా, ఈ ఖరీదైన వాచీ బహుమతి గురించి నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. భారత్ పేద దేశం అన్నవాళ్లంతా.. ఈ గిఫ్ట్‌ను మక్కున వేలేసుకుంటారని కామెంట్లు పెడుతున్నారు. ఉంటే.. అనంత్ అంబానీ లాంటి ఫ్రెండ్స్ ఉండాలి అని పోస్టులు చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్