డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్‌లో ముంబై.. ఇక ఢిల్లీతో టైటిల్ పోరు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||నాట్ సీవర్ (72) హాఫ్ సెంచరీ||

ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఫైనల్‌కు చేరింది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 72 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన ముంబై.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 183 పరుగుల లక్ష్యాన్ని యూపీ ముందు ఉంచింది. ముంబైలో నాట్ సీవర్ (72) హాఫ్ సెంచరీ చేసింది. అనంతరం టార్గెట్‌ ఛేదనలో బరిలోకి దిగిన యూపీ.. ముంబై బౌలర్ల ధాటికి తాలలేకపోయింది. 17.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కిరణ్‌ నవగిరె (43) తప్ప ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో యూపీ పరాజయం పాలైంది. ముంబై బౌలర్లలో ఇసే వాంగ్ హ్యాట్రిక్ సహా ఒక వికెట్ కలిపి మొత్తం నాలుగు వికెట్లు తీసింది. సైకా ఇసాక్ 2 నాట్ సీవర్‌, హేలీ మ్యాథ్యూస్‌, కలిత ఒక్కో వికెట్‌ తీశారు. 

లక్ష్య ఛేదనకు దిగిన యూపీకి ముంబై బౌలర్‌ వోంగ్‌ కేవలం 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసింది. యూపీ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఓపెర్‌ అలీసా హీలీ (11) తీవ్రంగా నిరాశపరిచింది. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కిరణ్‌ నవగినే (43, 27 బంతుల్లో 4×4, 3×6) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 17.4 ఓవర్లకు యూపీ 110 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్‌ కోసం ఢిల్లీతో ముంబై తలపడుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్