మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆటగాళ్లు అమీలీ కెర్ (43), బ్రూక్ హాలీడే (38), సుజీ బేట్స్ (32) రాణించడంతో న్యూజిలాండ్ జట్టు మెరుగైన స్కోరును చేయగలిగింది.
ట్రోఫీతో న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు
మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆటగాళ్లు అమీలీ కెర్ (43), బ్రూక్ హాలీడే (38), సుజీ బేట్స్ (32) రాణించడంతో న్యూజిలాండ్ జట్టు మెరుగైన స్కోరును చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంలాబా రెండు వికెట్లు పడగొట్టింది. లక్ష చేదనలో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 32 పరుగులు తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వొల్వార్ట్ (33), బ్రిట్స్ (17), ట్రెయన్ (14) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ గా నిలిచిన అమీలీ కేర్ మూడు వికెట్లు పడగొట్టింది. ఇకపోతే 2009, 2010 టోర్నీలో రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ ఈసారి మాత్రం ట్రోఫీని కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన టి20 వరల్డ్ కప్ తొమ్మిదోది. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఆరుసార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలువగా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఒక్కోసారి విజేతగా నిలిచాయి. తాజాగా న్యూజిలాండ్ జట్టు ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో భారీ లక్ష్య సాధనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు మెరుగైన ఆట తీరును కనబరిచారు. ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు.
మిగిలిన ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో దక్షిణాఫ్రికా జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు కెప్టెన్ వాల్వార్ట్, బ్రెట్స్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయడంతో తొలి బంతి నుంచే ఎటాక్కింగ్ లోకి దిగారు. దీంతో తొలి వికెట్ కు 51 పరుగులను జోడించారు. ఏడో బ్రిట్స్ (17) ను జొనాస్ అవుట్ చేయగా, పదో ఓవర్ లో కీలకమైన వాల్వార్ట్ తోపాటు భాష్ (9) ను ను పెవిలియన్ చేర్చిన కేర్ సఫారీలకు డబుల్ షాక్ ఇచ్చింది. అప్పటికే భారీగా పెరిగిపోయిన రన్ రేట్ ను అధిగమించలేక దక్షిణాఫ్రికా జట్టు వరుసగా వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. దీంతో వరుసగా రెండోసారి సఫారీలు రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది. 2023లో ఆ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు దూకుడుగా ఆడింది. టాప్ ఆర్డర్ లో కేర్, బేట్స్, మిడిల్ ఆర్డర్ లో హాలిడే దూకుడుగా ఆడటంతో కివీస్ పటిష్టమైన స్కోర్ చేసింది. రెండో ఓవర్ లో ఫ్లిమ్మేర్ (9) అవుట్ అయిన బెట్స్, కేర్ వేగంగా ఆడి రెండో వికెట్ కు 37 పరుగులు జోడించారు. అనంతరం ధనాధన్ బ్యాటింగ్ తో హాలిడే నాలుగో వికెట్ కు 57 పరుగులు జోడించి జట్టు విజయం సాధించేందుకు అవసరమైన పరుగులు చేయడంలో కీలకంగా మారింది.