మరో క్రికెట్ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. గురువారం నుంచి మహిళల ఐసీసీ టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ లో మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఏడో టైటిల్ పై కన్నేసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ ఫేవరెట్ జట్లుగా బరిలోకి దిగుతున్నాయి. హార్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని టీమిండియా తొలి మ్యాచ్ న్యూజిలాండ్ తో శుక్రవారం ఆడనుంది. ఈ నెల 20న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
టి20 వరల్డ్ కప్ ఆడనున్న మహిళల జట్లు
మరో క్రికెట్ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. గురువారం నుంచి మహిళల ఐసీసీ టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ లో మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఏడో టైటిల్ పై కన్నేసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ ఫేవరెట్ జట్లుగా బరిలోకి దిగుతున్నాయి. హార్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని టీమిండియా తొలి మ్యాచ్ న్యూజిలాండ్ తో శుక్రవారం ఆడనుంది. ఈ నెల 20న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఎనిమిది మహిళల టి20 వరల్డ్ కప్ పోటీలు జరగగా, తొమ్మిదో వరల్డ్ కప్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవని టీమిండియా జట్టు ఈసారి ఆ కలను నెరవేర్చుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆరుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు మరోసారి టైటిల్ చేజెక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్, గత టోర్నీ రన్నరఫ్ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సత్తా చాటాలనే కసితో బరిలోకి దిగుతున్నాయి. గతంతో పోలిస్తే మిగతా జట్ల ప్లేయర్లు కూడా ప్రాంచైజీ క్రికెట్ అనుభవం గడించడంతో టోర్నీ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. సార్జాలో జరిగే ఆరంభ మ్యాచ్ లో స్కాట్లాండ్ జట్టుతో బాంగ్లాదేశ్ తలపడనుంది. వాస్తవంగా ఈ పొట్టి కప్ బంగ్లాదేశ్ లో జరగాలి. అక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా అశాంతి రేగడంతో వేదికను యూఏఈకి మార్చారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు వరల్డ్ కప్ పోటీల్లో 2010, 2012, 2014లో వరుసగా మూడుసార్లు ఛాంపియన్ గా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. 2016లో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా కు చెక్ చెప్పింది. 2018, 2020, 2023 లో మళ్ళీ వరుసగా ఆస్ట్రేలియా జట్టు మూడుసార్లు టైటిల్ ఎగరేసుకుపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా మరోసారి తమ చైత్ర యాత్రను కొనసాగించాలని కోరుకుంటోంది.
రెండు గ్రూపులుగా విభజించి మ్యాచులు
ఈ వరల్డ్ కప్ లో ప్రస్తుతం 10 జట్లు పాల్గొంటున్నాయి. సెమీస్, ఫైనల్ సహా 23 మ్యాచ్ లు షార్జా, దుబాయిలో జరగనున్నాయి. మొత్తం జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపులో టాప్ -2లో నిలిచిన జట్లు సెమిస్ చేరతాయి. గ్రూప్ - ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఉండగా, గ్రూప్ బీలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ టోర్నీ ప్రైజ్ మనీని రికార్డు స్థాయిలో 225 శాతం పెంచారు. పురుషులతో సమానంగా మహిళలు జట్టు విజేతకు నగదు దక్కునుంది. విజేతకు రూ.19.64 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.9.82 కోట్లు అందించనున్నారు. ఈ టోర్నీలో ఐపీఎల్ వంటి లీగుల్లో ఉపయోగించే స్మార్ట్ రిప్లై సిస్టమ్ లో తొలిసారి ఐసిసి వరల్డ్ కప్ లో ఉపయోగించనున్నారు. రివ్యూ ఫలితాన్ని వేగంగా ప్రకటించేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. ఇందులో టీవీ ఎంపైర్ కు హాక్ ఐ విజువల్స్ నేరుగా ఆపరేటర్ల నుంచి అత్యుత్తమ కోణాల్లో అందనున్నాయి. ఇంతకుముందు ఆపరేటర్లు, థర్డ్ ఎంపైర్ కు మధ్య టీవీ బ్రాడ్ కాస్ట్ డైరెక్టర్ అనుసంధానకర్తగా ఉండేవాడు. ఈ కారణంగా కొంత జాప్యం జరిగేది. ఈ వరల్డ్ కప్ లో భారత జట్టు తొలి మ్యాచ్ ను అక్టోబర్ 4వ తేదీన దుబాయ్ వేదికగా ఆడనుంది. న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ లో భారత జట్టు తలపడనుంది. అక్టోబర్ ఆరో తేదీన రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ తో, అక్టోబర్ 9వ తేదీన మూడో మ్యాచ్ శ్రీలంక జట్టుతో, అక్టోబర్ 13న ఆస్ట్రేలియా జట్టుతో నాలుగో మ్యాచ్ ఆడనుంది.