స్వల్ప లక్ష్య సాధనకు చెమటోడ్చిన విండీస్

టి20 వరల్డ్ కప్ లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు పసికూన పపువా న్యూగినియాపై విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు తొలి నుంచే పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. స్వల్ప స్కోరును కాపాడుకునేందుకు పపువా న్యూగినియా బౌలర్లు అద్భుతమైన పోరాటాన్ని చేశారు. స్వల్ప లక్ష్య సాధనలో వెస్టిండీస్ జట్టు తడబాటుకు గురి కావడంతో 19 వ ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళింది.

West Indies team members in joy after taking

వికెట్ తీసిన ఆనందంలో వెస్టిండీస్ జట్టు సభ్యులు


టి20 వరల్డ్ కప్ లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు పసికూన పపువా న్యూగినియాపై విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆదివారం సాయంత్రం జరిగిన రెండో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా జట్టు 8 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 136 పరుగులు మాత్రమే చేసింది. ఈ జట్టులోని సేసే భౌ (50) పరుగులతో మాత్రమే రాణించాడు. చివరలో డొరిగా 27 పరుగులు చేసి బ్యాట్ ఝులిపించడంతో ఆమాత్రమైన పరుగులు చేయగలిగింది. మిగిలిన ఆటగాళ్లు స్వల్ప పరుగులు మాత్రమే చేయడంతో పపువా న్యూగినియా 136 పరుగులకు పరిమితమైంది. చివరి మూడు ఓవర్లలో పపువా న్యూగినియా జట్టు 37 పరుగులు సాధించడంతో ఈ జట్టుకు ఆమాత్రమైన స్కోరు లభించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు తొలి నుంచే పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. స్వల్ప స్కోరును కాపాడుకునేందుకు పపువా న్యూగినియా బౌలర్లు అద్భుతమైన పోరాటాన్ని చేశారు. స్వల్ప లక్ష్య సాధనలో వెస్టిండీస్ జట్టు తడబాటుకు గురి కావడంతో 19 వ ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళింది. బ్రాండన్ కింగ్ (35), పూరన్ (27) రాణించగా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన రోస్టన్ చేజ్ 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులతో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి 3 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన వేళ చేంజ్ బ్యాట్ ఝులిపించి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు. స్వల్ప స్కోరు, పసికూన జట్టుపై విజయం సాధించేందుకు వెస్టిండీస్ జట్టు పడిన కష్టాన్ని చూసిన ఎంతోమంది.. లీగ్ ప్రారంభంలోనే పెద్ద జట్టుకు షాక్ తగులుతుందని అంతా భావించారు. ఐదు వికెట్లు పడిపోవడం, పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో వెస్టిండీస్ జట్టు విజయంపై క్రికెట్ అభిమానులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే చేజ్ అద్భుతమైన ఆట తీరుతో వెస్టిండీస్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించి పెట్టాడు. ఇదిలా ఉంటే ఉదయం జరిగిన తొలి మ్యాచ్ లో  కెనడాపై అమెరికా జట్టు విజయాన్ని నమోదు చేసింది. 195 వరుగుల భారీ లక్ష్యాన్ని అమెరికా జట్టు 14 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల నష్టానికి పూర్తి చేసింది. అమెరికా జట్టులోని ఆరోన్ జోన్స్ 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, పది సిక్సులతో విజృంభించి 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్