ఫైనల్ పంచ్ ఎవరిదో.. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడే భారత్ న్యూజిలాండ్ తుది పోరు.!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టుకు ఇది వరుసగా మూడో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కాగా, టోర్నీలో ఇప్పటిదాకా భారత రెండుసార్లు విజేతగా నిలిచింది. 2013లో భారత్ చివరిసారి ఈ ట్రోఫీని గెలిచేది. తాజాటోనీలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జెట్లపై గెలిచి ఫైనల్ కు చేరింది. అటు న్యూజిలాండ్ జట్టు కూడా గ్రూప్ దశలో భారత్ చేతిలో మాత్రమే ఓడింది. 2000 లో భారత్ పైన గెలిచి తమ ఏకైక టైటిల్ దక్కించుకోవడం న్యూజిలాండ్ జట్టుకు ఫైనల్ మ్యాచ్లో సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లోను భారత్ పై 3-1 తో కివీస్ జట్టుకు ఆధిక్యం ఉంది.

The players of both sides

ఇరుజట్ల ఆటగాళ్లు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టుకు ఇది వరుసగా మూడో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కాగా, టోర్నీలో ఇప్పటిదాకా భారత రెండుసార్లు విజేతగా నిలిచింది. 2013లో భారత్ చివరిసారి ఈ ట్రోఫీని గెలిచేది. తాజాటోనీలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జెట్లపై గెలిచి ఫైనల్ కు చేరింది. అటు న్యూజిలాండ్ జట్టు కూడా గ్రూప్ దశలో భారత్ చేతిలో మాత్రమే ఓడింది. 2000 లో భారత్ పైన గెలిచి తమ ఏకైక టైటిల్ దక్కించుకోవడం న్యూజిలాండ్ జట్టుకు ఫైనల్ మ్యాచ్లో సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లోను భారత్ పై 3-1 తో కివీస్ జట్టుకు ఆధిక్యం ఉంది. అందుకే భారత జట్టు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన కప్పు చేజారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

స్పిన్నర్లే ప్రధాన ఆయుధంగా భారత్..

ఈ టోర్నీలో స్పిన్నర్లను ప్రధాన ఆయుధంగా భారత జట్టు బరిలోకి దించుతోంది. ఫైనల్ మ్యాచ్లోను వారినే తమ అస్త్రాలుగా భారత జట్టు వినియోగించుకోనుంది. బుమ్రా లేని లోటును ఏమాత్రం తెలియనీయకుండా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతోంది. దీనికి కారణం జట్టులోనే నలుగురు స్పిన్నర్లు. కుడి - ఎడమ కాంబినేషన్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి బ్యాటర్లను తమ ఉచ్చులో బిగిస్తున్నారు. న్యూజిలాండ్తో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి చేసిన మాయాజాలంతో ఆ జట్టు కకావికలం అయింది. అయితే గడిచిన రెండు మ్యాచ్ల్లో కుల్దీప్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడి స్థానంలో ప్యాసర్లు హర్షిత్ రాణా లేదా అర్స్ దీప్ ల్లో ఒకరికి చోటిస్తారా.? అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు కుడిచేతి వాటం బ్యాటర్లపై జడేజా, అక్షర్ పటేల్ ప్రభావం చూపుతున్నారు. మధ్య ఓవర్లలో ఖచ్చితమైన లెంత్తో కట్టడి చేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పైన నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగి ఫలితాన్ని రాబట్టారు. అందుకే ఫైనల్ మ్యాచ్ లోను ఇదే వ్యూహంతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లుగా షమీ, హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో పరుగులను నియంత్రంచాలనుకుంటున్నారు. శమీ నుంచి పూర్తిస్థాయి బౌలింగ్ ప్రదర్శన రావాల్సి ఉంది. 

వీళ్లు రాణిస్తే భారత జట్టుకు తిరిగి ఉండదు..

భారత జట్టులోని వెటర్న్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లకు ఇదే చివరి ఐసిసి టోర్నీ కావచ్చు. ఈ మ్యాచ్ లో వీరిద్దరూ రాణించడం బట్టే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. గడిచిన ఏడాది టీ20 వరల్డ్ కప్ అందించినట్టుగానే ఈసారి మరో ఐసీసీ ట్రోఫీతో మురిపించాలని రోహిత్, కోహ్లీ పట్టుదలగా ఉన్నారు. విరాట్ కోహ్లీ టోర్నీలో తన ఫామ్ చాటుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. పిచ్ లు భిన్నంగా ఉండడంతో ఈ టోర్నీలో అతని ఆటలో మునుపటి వేగం కనిపించడం లేదు. దీంతో ఫైనల్లో ఆ లోటును తీరుస్తూ న్యూజిలాండ్ పై కోహ్లీ విరుచుకుపడాలని అభిమానులు కోరుకుంటున్నారు రోహిత్ శర్మ ఉన్న కాసేపు ఎడాపెడా షార్ట్లు బాదేసుకున్న నిలకడ లోపిస్తోంది టోర్నీలో అతడి అత్యధిక స్కోరు 41 మాత్రమే రోహిత్ శర్మ 2 ఓవర్ల వరకు కుదురుకోగలిగిన భారత జట్టు భారీ స్కోరు సాధించగలదు.  మరోవైపు ఓపెనర్ గిల్, శ్రేయాస్, అక్షర్, రాహుల్, హార్దిక్ ఊపు మీదున్నారు. మరోసారి కలిసికట్టుగా ఆడితే ట్రోఫీ మరోసారి భారత్ జట్టు విజయం సాధించే అవకాశం ఉంది. 

బలంగానే న్యూజిలాండ్ జట్టు..

న్యూజిలాండ్ జట్టు కూడా భారత్ కు దీటుగా బదులిచ్చే స్థాయిలోనే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఆ జట్టు అదరగొడుతోంది. న్యూజిలాండ్ జట్టులో సమర్థులైన స్పిన్నర్లు ఉన్నారు. కివీస్ జట్టులోనే సమర్థులైన స్పిన్నర్లు దక్షిణాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో వనికించారు. కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్ లో పరుగులు సాధించడం అంత సులభం కాదు. ఈ లెఫ్టామ్ స్పిన్నర్ ఖాతాలో 4.85 ఎకానమీ రేటుతో 7 వికెట్లు ఉన్నాయి. అతడికి తోడు బ్రెష్ వెల్, రచిన్, ఫిలిప్స్ దుబాయ్ పిచ్చి పై రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. గడిచిన ఏడాది స్పిన్ బలంతోనే ఆ జట్టు భారత జట్టుపై టెస్టు శిరీషను క్లీన్ స్వీప్ చేసింది. భారత జట్టుపై ఐదు వికెట్లతో రాణించిన పేషెర్ హేనృే గాయం కారణంగా జట్టుకు దూరం కావడం దాదాపు ఖాయమైంది. సెమీస్లో దక్షిణాఫ్రికా పై 362 పరుగులు సాధించి బ్యాటర్ల సైతం ఊపు మీద ఉన్నారు. రచన రవీంద్ర, విలియమ్సన్ శతకాలతో అదరగొట్టారు. మిచెల్, గ్రాండ్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ లతో సఫారీలను చిత్తుగా ఓడించారు. ఇక వీరు ఫీల్డింగ్ ప్రత్యర్థి జట్లను వనికిస్తుంటుంది. అందుకే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న న్యూజిలాండ్ను ఓడించడం భారత్కు అంతా సులభమేమీ కాదు. 

పిచ్ అంచనా..

భారత జట్టు ఇప్పటివరకు నాలుగు పిచ్ లపై ఆడింది. అయితే ఫైనల్ కు మాత్రం పాకిస్తాన్ తో ఆడిన పిచ్చిను సిద్ధం చేయనున్నారు. ఆ మ్యాచ్ జరిగే రెండు వారాలయింది కాబట్టి తాజాగా ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నారు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సులువైన ఆ తర్వాత చేదనా కష్టంగా మారింది. స్పిన్నర్ల కే కాకుండా ఈ వికెట్ ప్యాసర్లకు కూడా అనుకూలిస్తుంది. 

ఇవి జట్లు అంచనా 

భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, వరుణ్ చక్రవర్తి 

న్యూజిలాండ్ జట్టు 

యంగ్, రచన రవీంద్ర, విలియమ్సన్, లాథమ్ మిచెల్,  ఫిలిప్స్, బ్రేస్వెల్, శాంట్నర్ (కెప్టెన్), జేమిషన్, ఓరౌర్కీ, హెన్రీ/ స్మిత్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్