భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ తాజా సీజన్ లో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్ నుంచి అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ తో జట్టుకు గొప్ప విజయాలను అందిస్తున్నాడు. చెన్నై తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఐపీఎల్ 17 వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ తాజా సీజన్ లో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్ నుంచి అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ తో జట్టుకు గొప్ప విజయాలను అందిస్తున్నాడు. చెన్నై తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఐపీఎల్ 17 వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 29 బంతుల్లోనే 47 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ ల్లో 708 పరుగులకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు సీజన్లలో 700కు పైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ గా కోహ్లీ అవతరించాడు. ఓవరాల్ గా చూసుకుంటే కోహ్లీ రెండో ఆటగాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ రెండు సీజన్లలో 700కి పైగా పరుగులు సాధించి ముందు వరుసలో ఉన్నాడు. దీంతోపాటు మరికొన్ని ఘనతలను కోహ్లీ తన పేరిట ఈ సీజన్ లో లిఖించుకున్నాడు. ఈ సీజన్ లో 708 పరుగులు చేసిన కోహ్లీ.. 155.60 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్ లీగ్ స్టేజ్ లో విరాట్ కోహ్లీ 37 సిక్సులు బాది అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ముందంజలో ఉన్నాడు. భారత్ వేదికగా జరిగిన టి20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు జాబితాలో విరాట్ కోహ్లీ ముందంజలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై కొట్టిన పరుగులతో 9 వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతడు తర్వాత స్థానంలో రోహిత్ శర్మ ఎనిమిది వేల పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.