||విరాట్ కోహ్లీ||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: టీమిండియా మాజీ కెప్టెన్, కింగ్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ దేవుడు సచిల్ టెండుల్కర్ ఆల్ టైం రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ.. సచిన్ రికార్డును బద్దలుకొట్టి కొత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా నాథన్ లయన్ బౌలింగ్లో ఫోర్ కొట్టి ఈ ఘనత సాధించాడు. సచిన్ టెండుల్కర్ 577 మ్యాచ్‌లలో 25 వేల పరుగులు సాధించగా, కోహ్లీ 549 మ్యాచ్‌లలోనే ఈ రికార్డును సాధించాడు.
విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించటంపై ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ పరుగుల దాహం ఎప్పటికీ తీరనిదని, ఇంకా మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా, రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో కంగారులను మట్టి కరిపించి 2-0 ఆధిక్యంలో నిలిచింది.
25 వేల పరుగుల సాధించిన క్రికెటర్లు (మ్యాచ్లు)
విరాట్ కోహ్లీ - భారత్ (549)
సచిన్ - భారత్ (577)
రికీ పాటింగ్-ఆస్ట్రేలియా (588 మ్యాచ్ లు)
జకస్ కలిస్-దక్షిణాఫ్రికా (594)
కుమార సంగక్కర-శ్రీలంక (608)
మహేల జయవర్దనే-శ్రీలంక (701)