అరంగేట్రంలోనే అదరగొట్టిన విఘ్నేశ్‌.. ఇన్‌స్టాలో 3.9 లక్షల ఫాలోవర్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసే గొప్ప వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో ఆడుతున్న టాప్‌ ఆటగాళ్లంతా ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే. తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌లోనూ మరో యువ సంచలనం రాత్రికి రాత్రే మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఆ యువ క్రీడాకారుడి పేరు విఘ్నేశ్‌ పుత్తూర్‌. ఈ మలయాళీ యువ స్పన్నర్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగిన విఘ్నేశ్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.

Vignesh Puttur

విఘ్నేశ్‌ పుత్తూర్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసే గొప్ప వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో ఆడుతున్న టాప్‌ ఆటగాళ్లంతా ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే. తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌లోనూ మరో యువ సంచలనం రాత్రికి రాత్రే మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఆ యువ క్రీడాకారుడి పేరు విఘ్నేశ్‌ పుత్తూర్‌. ఈ మలయాళీ యువ స్పన్నర్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగిన విఘ్నేశ్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తోపాటు హిట్టర్లుగా పేరుగాంచిన శివమ్‌ దూబే, దీపక్‌ చాహార్‌ వికెట్లను కూడా తీసి ఔరా అనిపించాడు. ఈ 24 ఏళ్ల లెట్‌ స్పిన్నర్‌ ఎంఎస్‌ ధోనీని కూడా ఆకట్టుకున్నాడు. అద్భుత బౌలింగ్‌ చేసిన విఘ్రేశ్‌పై ప్రశంసలు వర్షం కురుస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలో కూడా విఘ్నేశ్‌ సెన్సేషన్‌గా మారాడు. మొన్నటి వరకు విఘ్నేశ్‌ పుత్తూర్‌ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆడిన ఒక్క మ్యాచ్‌తోనే సెలబ్రిటీగా మారిపోయాడు.

మొన్నటి వరకు విఘ్నేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 25 వేల మంది ఫాలోవర్స్‌ మాత్రమే ఉండేవారు. ఇందులో విఘ్నేశ్‌కు సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి. చెన్నైతో మ్యాచ్‌ జరిగిన తరువాత విఘ్నేశ్‌ గురించి సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు వెతకడం ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేశ్‌ అకౌంట్‌ కనిపించడంతో అంతా ఇప్పుడు అతడిని ఫాలో అవుతున్నారు. చెన్నైతో మ్యాచ్‌ తరువాత విఘ్నేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.9 లక్షల మంది ఫాలోవర్లు అయ్యారు. అంటే ఒక మ్యాచ్‌ తరువాత ఏకంగా విఘ్నేశ్‌ 3.7 లక్షల మంది వరకు ఫాలోవర్లు పెరిగిపోయారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విఘ్నేశ్‌ స్టార్‌గా మారిపోయాడు. విఘ్నేశ్‌ పుత్తూరును ఐపీఎల్‌ 2025 వేలంలో ముంబై ఇండియన్‌ జట్టు రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. రాష్ట్ర సీనియర్‌ జట్టుకు కూడా ఆడని ఆటగాడిని ముంబై తీసుకున్నప్పుడు అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అయితే, అరంగేట్రం మ్యాచ్‌లోనే అందరి అనుమానాలకు చెక్‌ చెబుతూ సత్తా చాటాడు విఘ్నేశ్‌. విఘ్నేశ్‌ రూపంలో మరో అద్భుత ప్రతిభ ఉన్న ఆటగాడిని ముంబై జట్టు పట్టుకు వచ్చిందని ఆ ప్రాంచైజీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఏది ఏమైనా ఐపీఎల్‌ ఎంతో మంది యువ క్రికెటర్ల సత్తాను బయట ప్రపంచానికి తెలియజేస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్