నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టి20.. తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లాండ్ జట్టు

భారత్ - ఇంగ్లాండ్ మధ్య మూడో టి20 మంగళవారం జరగనుంది. రాజ్కోట్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఇప్పటికే ముగిసిన రెండు టీ20 మ్యాచ్లను భారత జట్టు గెలుచుకుంది. మూడో మ్యాచ్లోను విజయం సాధించడం ద్వారా సిరీస్ కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో భారత్ జట్టు బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణిస్తున్న భారత్ మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. రాజ్ కోట్ లోను ఇదే ఊపును కొనసాగించాలని యువ భారత్ జట్టు కోరుకుంటోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఒత్తిడిలో మూడో టి20 మ్యాచ్ లోనూ బరిలోకి దిగుతోంది.

captains of both teams

ఇరు జట్ల కెప్టెన్లు

భారత్ - ఇంగ్లాండ్ మధ్య మూడో టి20 మంగళవారం జరగనుంది. రాజ్కోట్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఇప్పటికే ముగిసిన రెండు టీ20 మ్యాచ్లను భారత జట్టు గెలుచుకుంది. మూడో మ్యాచ్లోను విజయం సాధించడం ద్వారా సిరీస్ కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో భారత్ జట్టు బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణిస్తున్న భారత్ మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. రాజ్ కోట్ లోను ఇదే ఊపును కొనసాగించాలని యువ భారత్ జట్టు కోరుకుంటోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఒత్తిడిలో మూడో టి20 మ్యాచ్ లోనూ బరిలోకి దిగుతోంది. మొదటి రెండు టి20 మ్యాచ్ లో ఓటమిపాలు కావడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో టి20 లో విజయం సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. అయితే భారత జట్టు మాత్రం యువ సారధి సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో దూకుడుగా ఆడుతోంది. జట్టు విజయాలు సాధిస్తున్నప్పటికీ సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. గడిచిన 17 ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్ 26.81 సగటుతో 429 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో పరుగుల వరద పారే రాజ్కోట్ లో అయినా సూర్య కుమార్ యాదవ్ ఫామ్ అందుకోవాలని భారత జట్టు భావిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస సెంచరీలతో రెచ్చిపోయిన సంజు సాంసన్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి రెండు మ్యాచ్ల్లోను షార్ట్ బాల్స్ కు పెవిలియన్ బాట పట్టాడు. సంజు సాంసన్ బ్యాట్ నుంచి పరుగులు వస్తే మాత్రం భారత జట్టుకు తిరిగి ఉండదని యాజమాన్యం భావిస్తోంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మంచి టచ్ లో ఉండడం భారత జట్టుకు సానుకూల అంశంగా చెప్పవచ్చు. రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి గాయాలతో మ్యాచ్కు దూరం కాగా.. మూడో 20 లో శివమ్ దూబే, రామన్దీప్ సింగ్ ను తొలి గట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రాజ్కోట్ పిక్స్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారీగా పరుగులువస్తాయి. 

మరోవైపు ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి అద్వానంగా తయారయింది. జట్టులో స్టార్లు, హిట్టర్లు ఉన్నప్పటికీ ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. మొదటి రెండు మ్యాచుల్లో కెప్టెన్ జోస్ బట్లర్ మిగిలిన ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. రాజ్కోట్ లో అయినా కీలక ఆటగాళ్లు రాణిస్తారు అన్న ఆశతో ఆ జట్టు యాజమాన్యం ఉంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రాజ్కోట్ మైదానంలో భారత జట్టుకు మెరుగైన రికార్డులు ఉన్నాయి. ఇక్కడ ఆడిన ఐదు టి20 మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో భారత జట్టు విజయాన్ని సాధించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్