ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలోనూ విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలోనూ విజయం సాధించడం ద్వారా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వన్డే సిరీస్ ను ఇప్పటికే భారత్ దక్కించుకుంది. చివర వన్డేలో విజయం సాధించడం ద్వారా కాస్తయినా పరువు దక్కించుకోవాలన్న కసితో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా చివరదైనా మూడవ వండే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ మైదానంలో జరగనుంది. చివరి వన్డేలో విజయం సాధించి ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీలో సగర్వంగా బరిలోకి దిగేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది.
ఇరు జట్ల కెప్టెన్లు
ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలోనూ విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలోనూ విజయం సాధించడం ద్వారా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వన్డే సిరీస్ ను ఇప్పటికే భారత్ దక్కించుకుంది. చివర వన్డేలో విజయం సాధించడం ద్వారా కాస్తయినా పరువు దక్కించుకోవాలన్న కసితో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా చివరదైనా మూడవ వండే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ మైదానంలో జరగనుంది. చివరి వన్డేలో విజయం సాధించి ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీలో సగర్వంగా బరిలోకి దిగేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. అటు వరుసుగా టీ20, వన్డే సిరీస్ లను కోల్పోయిన బట్లర్ సేనకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మెకల్లమ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. బజ్ బాల్ గేమ్ అలవాటు చేసుకున్న ఈ టీం భారత్లో తమ స్థాయికి తగ్గ ఆట తీరును కనబరచడం లేదు. కనీసం చివరి వన్డేలో అయినా గెలిచి ఓదార్పు విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెట్టాలని ఆ జట్టు భావిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న చివరి వన్డే కావడంతో ఇరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలోకి దిగుతున్నాయి.
ఇంగ్లాండు జట్టును వేధిస్తున్న సమస్యలు
భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది. రెండో వన్డేలో ఇంగ్లాండు బ్యాటర్లు విశేషంగా రాణించారు. టాప్ 6 ఆటగాళ్లు జోరుతో స్కోర్ 300 దాటింది. కానీ భారీ స్కోరును కాపాడుకునే క్రమంలో బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. భారత్ అలవోకగా లక్ష్యాన్ని పూర్తిచేసింది. కటక్ లో చేజింగ్ జట్టుకు విజయావకాశాలు ఉంటాయని తెలిసి కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఇంగ్లాండ్ జట్టును దెబ్బ కొట్టింది. పేసర్ ఆర్చర్ కు విశ్రాంతినివ్వడం దెబ్బతీసింది. ఈ మ్యాచ్ లో ఆర్చర్ తోపాటు బ్రాండన్ కార్సును ఆడించే అవకాశం ఉంది. స్పిన్నర్ ఆదిల్ రషీద్ మాత్రం నిలకడగా రాణించగలుగుతుండడం ఆ జట్టుకు కొంత ఓదార్పును ఇచ్చే అంశంగా చెప్పవచ్చు.
భారత జట్టులో మార్పులు ఉంటాయా.?
భారత జట్టు ఎప్పటికీ వన్డే సిరీస్ దక్కించుకుంది. చివర వన్డే నామమాత్రం కావడంతో ఏమైనా మార్పులు చేసి జట్టును బరిలోకి దించుకుందాం చూడాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రిజర్వుడ్ బెంచ్ ఆటగాళ్లకు ప్రాక్టీస్ లభిస్తే బాగుంటుంది అన్న విశ్లేషణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ రెషబ్ పంత్, పేసర్ అర్స్ దీప్, స్పిన్నర్ సుందర్లను ఆడిస్తారా అన్నదే చూడాల్సి ఉంది. పంత్ జట్టులోకి రావాలంటే రాహుల్ ను తప్పించాలి. అతను ఇప్పటికే ఆరో నెంబర్లు ఆడి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే భారత్ జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనికి కోచ్ గంభీర్ సిద్ధంగా ఉన్నాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభం కానుంది.
తుదిజట్ల అంచనా ఇది
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్/రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా/సుందర్, అక్షర్ పటేల్, వరుణ్, రాణా/అర్స్ దీప్, షమీ
ఇంగ్లాండ్ జట్టు అంచనా : డకెట్, సాల్ట్, బాంటన్, రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), లివింగ్ స్టోన్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్