ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చిట్టచివరి ప్లే ఆఫ్ మ్యాచ్ శుక్రవారం జరగనుంది. క్వాలిఫైయర్ - 2 మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదిక ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు బలంగానే కనిపిస్తుండడంతో మ్యాచ్ పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చిట్టచివరి ప్లే ఆఫ్ మ్యాచ్ శుక్రవారం జరగనుంది. క్వాలిఫైయర్ - 2 మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదిక ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు బలంగానే కనిపిస్తుండడంతో మ్యాచ్ పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. శుక్రవారం వర్షం నుంచి ఎలాంటి అంతరాయం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాత్రి మంచు ప్రభావం అధికంగా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీలింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ పిచ్ పై ఈ సీజన్ లో జరిగిన ఏడు మ్యాచ్ ల్లో ఐదుసార్లు చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇదిలా ఉంటే ఈ పిచ్ పై ఇరు జట్లకు మెరుగైన రికార్డు లేకపోవడం గమనార్హం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఈ పిచ్ లో హైదరాబాద్ జట్టు 134, రాజస్థాన్ జట్టు 141 పరుగులు చేసి ఓటమి పాలయ్యాయి.
దూకుడుగా ఆడుతున్న హైదరాబాద్ ఓపెనర్లు..
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తోందంటే దానికి ప్రధాన కారణం ఆ జట్టు ఓపెనర్లే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు ఆట తీరుతో అదరగొడుతున్నారు. పవర్ హిట్టింగ్ ను వీరిద్దరూ మరో స్థాయికి తీసుకెళ్లారు. పవర్ ప్లే లో హైదరాబాద్ జట్టు రెండుసార్లు 100కుపైగా పరుగులు చేసేలా వీరిద్దరూ చేశారంటే ఏ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో ఇప్పటి వరకు 166 సిక్సర్లు బాధగా, వీరిద్దరూ 72 సిక్సులు కొట్టడం విశేషం. చివరి మ్యాచ్ లో కోల్కతాపై వీరిద్దరూ విఫలం కావడంతో ఆ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత పటిష్టపరిచేందుకు మార్క్రమ్, ఫిలిప్స్ లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో త్రిపాఠి, క్లాసన్ వేగంగా ఆడుతున్నారు. నితీష్ కుమార్ రాజస్థాన్ పై 42 బంతుల్లోనే 76 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే ఫామ్ ను ఈ మ్యాచ్ లోను చూపాల్సి ఉంది. కెప్టెన్ కమిన్స్ ఫినిషర్ గా మంచి పాత్ర పోషిస్తున్నాడు. బౌలింగ్ లో పేసర్లు కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ కీలకం కానున్నారు. స్పిన్నర్ గా మార్కండేను ఆడించే అవకాశం ఉంది.
బౌలింగే బలంగా కనిపిస్తున్న రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. హైదరాబాద్ జట్టుతో పోలిస్తే రాజస్థాన్ బ్యాటర్లు విధ్వంసకరంగా కనిపించకపోయినా.. ఈ జట్టు విజయాల్లో బౌలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆరంభంలో లెఫ్టార్మ్ పేసర్లు వికెట్లు తీస్తుండగా.. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు చాహల్, అశ్విన్లతో మధ్య ఓవర్లలో ప్రత్యర్థి జట్లను నిలువరిస్తున్నారు. ఇక డెత్ ఓవర్లలో ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ పరుగులు కట్టడి చేయడంతోపాటు వికెట్లను తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో జైస్వాల్, కెప్టెన్ సంజు సాంసన్ పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. చపాక్ స్లో పిచ్ కావడంతో మూడో స్పిన్నర్ గా కేశవ్ మహారాజ్ ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇవీ జట్లు అంచనా
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లుగా జైస్వాల్, క్యాడ్ మోర్, సాంసన్ (కెప్టెన్), పరాగ్, జురెల్, పోవెల్/కేశవ్ మహారాజ్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్, చాహాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ జట్టు ఆటగాళ్లుగా హెడ్, అభిషేక్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్, క్లాసెన్, సమద్, షాబాజ్ అహ్మద్, కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మార్కండే బరిలోకి దిగనున్నారు.