నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. హైదరాబాద్, కోల్‌కతా జట్ల మధ్య పోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఈ సీజన్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో కోల్‌కతా, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనున్నాయి.

చెన్నై బీచ్ లోట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్లు

చెన్నై బీచ్ లోట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్లు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఈ సీజన్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో కోల్‌కతా, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనున్నాయి. రెండు జట్లు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటి వరకు కోల్‌కతా జట్టు 2012, 2014లో విజేతగా నిలవగా, హైదరాబాద్ జట్టు 2016లో ఛాంపియన్ గా అవతరించింది. ఐపీఎల్ లో రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్ లు జరగగా కేకేఆర్ 18, హైదరాబాద్ 9 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కోల్‌కతా జట్టు ఈ ఏడాది అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతోంది. ఏ ఒక్క ఆటగాడి పైన ఆధారపడి ముందుకు సాగలేదు ఈ జట్టు ప్రయాణం. ఓపెనర్లు నరైన్, సాల్ట్ దూకుడుతో హైటెక్ విజయాలతో ఆరంభమైన ప్రస్థానం.. లీగ్ దశలో టాప్ స్థానంతో ముగిసింది. ఈ సీజన్ లోక్ మూడో మ్యాచ్ లో కోల్‌కతా 272 పరుగులతో ఢిల్లీపై విరుచుకుపడింది. మిడిల్ ఆర్డర్ లో వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్, నితీష్ రానా, అండ్రీ రస్సెల్, రింకు సింగ్ తో కూడిన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, నరేన్ తురుపు ముక్కలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ జట్టులో కూడా సమతూకం అనిపిస్తోంది. లీగ్ దశలో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన సన్రైజర్స్ ఓపెనర్ లో హెడ్, అభిషేక్ ప్లే ఆఫ్ లో ఉసూరుమనిపించారు. ఈ జోడి విధ్వంసంతో 287, 277, 266 స్కోర్లతో బెదరగొట్టింది. కానీ స్లో పిచ్చిలపై వీరి బ్యాట్ల నుంచి బౌండరీలు రావడం లేదు. హెడ్ చివరి మూడు మ్యాచ్ల్లో రెండుసార్లు డక్ అవుట్ అయ్యాడు. దీంతో జట్టుకు మెరుపు ఆరంభాలు దక్కలేదు. టాప్ ఆర్డర్లో త్రిపాఠి దూకుడు సానుకూలాంశం అయిన, మిడిల్ ఆర్డర్ లో క్లాసేన్ పైనే భారం పడుతోంది. ఈ మ్యాచ్లో స్పిన్నర్లు అడ్డుకుంటే రైజర్స్ కు ఇబ్బందులు తప్పవు. నితీష్, మార్క్రమ్ ఇటీవల మ్యాచుల్లో విఫలం కావడం భారీ స్కోరుపై ప్రభావం చూపిస్తోంది. కేకేఆర్ తో పోలిస్తే స్పిన్ బలహీనంగా ఉన్న.. రాజస్థాన్పై సత్తా చాటిన ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్, పార్ట్ టైం బౌలర్ అభిషేక్ ఫైనల్ లోను జోరు కొనసాగించాలని ఆ జట్టు కోరుకుంటోంది. పేసర్లు కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ ఎప్పటిలాగే కీలకం కానున్నారు. 

తుది జట్లు అంచనా 

కోల్‌కతా : గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆండ్రి రస్సెల్, రింకు సింగ్, రమన్ దీప్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి 

సన్రైజర్స్ : హెడ్, అభిషేక్, త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, నితీష్, సమద్, కమిన్స్ (కెప్టెన్), ఉనాద్కత్, నటరాజన్, భువనేశ్వర్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్