నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య కీలక పోరు.. ఆసీస్ కు చావో రేవో

టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా - భారత జట్ల మధ్య సోమవారం రాత్రి 8 గంటలకు కీలక మ్యాచ్ జరగనుంది. సూపర్-8 దశలో ఈ రెండు జట్లు తలపడుతున్న ఆఖరి మ్యాచ్ కావడం గమనార్హం. సెయింట్ లూసియాలోని డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

India and Australia teams

భారత్, ఆస్ట్రేలియా జట్లు


టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా - భారత జట్ల మధ్య సోమవారం రాత్రి 8 గంటలకు కీలక మ్యాచ్ జరగనుంది. సూపర్-8 దశలో ఈ రెండు జట్లు తలపడుతున్న ఆఖరి మ్యాచ్ కావడం గమనార్హం. సెయింట్ లూసియాలోని డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆస్ట్రేలియా జట్టు సెమిస్ అవకాశాలు నిలిచి ఉంటాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా, భారత జట్టు ఇప్పటి వరకు ఓటమి లేకుండా టి20 వరల్డ్ కప్ లో జర్నీ సాగిస్తోంది. ఆస్ట్రేలియాపై విజయాన్ని సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో సెమిస్ లోకి అడుగు పెట్టాలని బారత్ జట్టు భావిస్తోంది. సూపర్-8 దశలో నాలుగు పాయింట్లతో ఉన్న టీమ్ ఇండియా సెమిస్ చేరాలంటే మరో విజయం చాలు. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దు అయిన రన్ రేట్ బాగానే ఉండడంతో భారత్ కు ఆందోళన లేదు. కానీ, ఓటమి మరి భారీ తేడాతో ఉండకుండా చూసుకోవాలి. అటు ఆస్ట్రేలియా పరిస్థితి దయనీయంగా ఉంది. ఆదివారం ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓటమిపాలు కావడంతో కంగారు జట్టు అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి ఆస్ట్రేలియాకు ఏర్పడింది. అదే సమయంలో తమకు పోటీగా ఉన్న ఆఫ్ఘాన్ జట్టు బంగ్లాదేశ్ పై ఓడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో భారత్ నెగ్గితే గతేడాది వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాకీ తీర్చుకున్నట్టు అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తో  ఆస్ట్రేలియా జట్టు ఓటమి తర్వాత కంగారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వరుస విజయాలతో జోరు మీద ఉన్న రోహిత్ సేనను అడ్డుకోవాలంటే ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా శ్రమించక తప్పదు. ముఖ్యంగా ఫీల్డింగ్ లో మెరుగుపడాల్సిన పరిస్థితి ఉంది.

మ్యాచ్ రోజు ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. బలమైన గాలులతోపాటు వర్షం కురిసే అవకాశం 55 శాతంగా అందడంతో మ్యాచ్ కు ఆటంకం కలగవచ్చు. ఇక్కడి మైదానం వికెట్లు బ్యాటింగ్ అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 

ఇది తుది జట్టు అంచనా..

 భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్),  విరాట్ కోహ్లీ, పంత్, సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర పటేల్, కుల్దీప్, బుమ్రా, అర్షదీప్ 

ఆస్ట్రేలియా జట్టు : హెడ్, వార్నర్ మార్ష్ (కెప్టెన్), మాక్స్ వెల్,  స్టోయినీస్, డేవిడ్, వేడ్, కమిన్స్, స్టార్క్, జంపా, హజల్ వుడ్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్