అదరగొట్టిన తిలక్ వర్మ.. మూడో టి20లో భారత్ విజయం

దక్షిణాఫ్రికా తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భారత జట్టు విజయాన్ని సాధించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టడంతో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సిరీస్ విజయాన్ని చేజిక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

Indian players in joy after taking a wicket

వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్ళు

దక్షిణాఫ్రికా తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భారత జట్టు విజయాన్ని సాధించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టడంతో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సిరీస్ విజయాన్ని చేజిక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత జట్టు ఆటగాడు తిలక్ వర్మ 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 107 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచే భారత జట్టు విజయం సాధించేందుకు అవసరమైన భారీ పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ వర్మ 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 50 పరుగులతో రాణించాడు. మిగిలిన ఆటగాళ్లు ఎవరు పెద్దగా స్కోర్ చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సిమేలానే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష చేదనలో దక్షిణాఫ్రికా జట్టు ఓవర్లన్నీ ఆడి ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 11 పరుగులు తేడాతో మూడో టి20 లో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో భారత జట్టు నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ లో 2-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జాన్సన్ 17 బంతుల్లో 54 పరుగులతో విధ్వంసం సృష్టించగా, క్లాసెన్ 41 పరుగులు, మార్క్రమ్ 29 పరుగులతో రాణించారు. భారత బౌలర్లో ఆర్స్ దీప్ మూడు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీ తో రాణించిన తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

అదరగొట్టిన ఓపెనర్లు 

మూడో టి20 మ్యాచ్ లో ఓపెనర్ సంజు సాంషన్ (0) మరోసారి విఫలం కావడంతో వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ లో చక్కదిద్దే  ప్రయత్నం చేశాడు. తిలక్ వర్మ, అభిషేక్ పోటాపోటీగా షాట్లు ఆడుతూ పవర్ ప్లేలో జట్టుకు భారీగా పరుగులు అందించారు. ఆరు ఓవర్ల ముగిసేసరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. అయితే, మధ్య ఓవర్లలో సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. తొమ్మిదో ఓవర్లో సిక్సర్ తో అర్థ సంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ ఆ వెంటనే స్టంపౌట్ అయ్యాడు. ఆ వెంటనే సూర్య కుమార్ యాదవ్ (1) సిమిలానే స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చడంతో భారత జట్టు 110/3 స్థితిలో నిలిచింది. ఆ తరువాత క్రేజీ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (18), వరస బౌండరీలతో స్కోరు బోర్డులో ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. 13వ ఓవర్ లో సింగిల్ తో తిలక్ వర్మ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యాను కేశవ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ (8) తన సహజ శైలిలో షాట్లు ఆడలేకపోయాడు. కానీ అప్పటివరకు ఒక ఎంత నెమ్మదిగా ఆడుతున్న తిలక్ వర్మ 15వ ఓవర్లో కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో 4, 6, 4తో ఒక్కసారిగా గేర్ మార్చడంతో టీమ్ స్కోర్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఆ తర్వాతి ఓవర్ లో కొట్జి బౌలింగ్లో రెండు సిక్సర్ల సహాయంతో 21 పరుగులు రాబట్టాడు. రింకు సింగ్ ను సిమేలానే బౌల్డ్ చేయడంతో ఐదో వికెట్ కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే వచ్చిన రమణదీప్ సింగ్ (15) జోరుగా పరుగులు చేయడంతో భారత జట్టు 200కుపైగా పరుగులను సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు తడబడింది.

ఓపెనర్లు రికెల్టన్ (20), హెన్రిక్స్ (21) దాటిగా ఆరంభించిన ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. రికెల్టన్ ను అర్స్ దీప్ బౌల్డ్ చేయగా, హేన్రిక్స్ వరుణ్ చక్రవర్తి బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన స్టబ్స్ రెండు ఫోర్లు సహాయంతో జోరు ప్రదర్శించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు పవర్ ప్లే ముగిసేసరికి 55/2తో నిలిచింది. మధ్య ఓవర్లలో వరుణ్, అక్షర పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఫామ్ లో ఉన్న స్టాబ్స్ ను అక్షర ఎల్బీగా వెనక్కి పంపించాడు. రెండు సిక్సర్ల సహాయంతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మార్క్రమ్ ను వరుణ్ చక్రవర్తి క్యాచ్ అవుట్ చేయడంతో 10 ఓవర్లకు దక్షిణాఫ్రికా జట్టు 84/4తో ఇబ్బందుల్లో పడింది. అయితే, క్లాసెన్, మిల్లర్ (18) ఐదో వికెట్ కు 58 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేశారు. చివరి 30 బంతుల్లో 86 పరుగులు కావాల్సి ఉండగా, మిల్లర్ ను పాండ్య అవుట్ చేశాడు. ధాటిగా ఆడుతున్న క్లాసెన్ ను అర్ష్ దీప్ పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ టీమ్ ఇండియాదే అని అంతా భావించారు. కానీ జాన్సన్ ఎడాపెడా షాట్లతో భారత శిబిరంలో గుబులు రేపాడు. 19వ ఓవర్ లో పాండ్య బౌలింగ్ లో జాన్సన్ రెండు సిక్సర్ల, మూడు ఫోర్లుతో 26 పరుగులు రాబట్టడంతో ఆఖరి ఓవర్లో లక్ష్యం 25 పరుగులకు దిగి వచ్చింది. అయితే, జాన్సన్ ను అవుట్ చేసిన అర్స్ దీప్ జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్