దక్షిణాఫ్రికాతో నాలుగు టి20 లో శిరీషను భారత జట్టు అదిరిపోయే రీతిలో ముగించింది. చివరి టీ20 మ్యాచ్ శుక్రవారం సాయంత్రం జోహాన్నెస్ బర్గ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, సంజు శాంసన్ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారత జట్టు చివరి టి20 మ్యాచ్ లో 135 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 భారీ పరుగులను చేసింది.
విజయోత్సవ సంబరాల్లో భారత ఆటగాళ్లు
దక్షిణాఫ్రికాతో నాలుగు టి20 లో సిరీస్ ను భారత జట్టు అదిరిపోయే రీతిలో ముగించింది. చివరి టీ20 మ్యాచ్ శుక్రవారం సాయంత్రం జోహాన్నెస్ బర్గ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, సంజు శాంసన్ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారత జట్టు చివరి టి20 మ్యాచ్ లో 135 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 భారీ పరుగులను చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఏ దశలోనూ విజయం వైపు పయనించలేదు. అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టిన భారత బౌలర్లు.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుసుగా వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో భారత జట్టు 135 పరుగులు తేడాతో నాలుగో టి20 లో విజయాన్ని సాధించి 3-1 తో సిరీస్ ను భారత జట్టు చేజిక్కించుకుంది.
నాలుగో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలినుంచి వేగంగా ఆడి భారీగా పరుగులు సాధించింది. యువ ఆటగాళ్లు తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, పది సిక్సర్ల సహాయంతో 120 పరుగులు, ఓపెనర్ సంజు సాంసన్ 56 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సహాయంతో 109 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు. ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడడంతో భారత జట్టుకు భారీగా పరుగులు లభించాయి. దక్షిణాఫ్రికా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు రెండో వికెట్ కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సిరీస్ లో తొలిసారి టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీనికి తగ్గట్టుగానే ఓపెనర్లు సంజు సాంసన్, ఇన్నింగ్స్ ను వాయు వేగంతో ప్రారంభించారు. ఆ తరువాత వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ గత మ్యాచ్ ఫామ్ ను కొనసాగించాడు. దీంతో భారత జట్టు స్కోరు పరుగులు పెట్టింది. తిలక్ వర్మ, సంజు పోటా పోటీగా పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా బౌలర్లు తేలిపోయారు. ప్రతి బౌలర్ ను వేటాడుతూ పరుగులు వరద పారించారు. తొలి ఓవర్ లో అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో రీజ వదిలేసాడు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ 6, 6, 4, 6 తో చెలరేగి 23 పరుగులు రాబట్టాడు. తరువాతి ఓవర్ లో సిమ్లాకు చిక్కడంతో తొలివికెట్ కు 73 పరుగులు భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ.. సంజు సాంసన్ తో జతకట్టి భారీగా పరుగులు రాబట్టాడు. ఈ జోడి ఎడాపెడా సిక్సర్లను, ఫోర్లు బాదేయడంతో ఆతిథ్య బౌలర్లకు బంతులు ఎలా వేయాలో తెలియక అర్థం కాలేదు. సాంసన్ దూకుడుగా ఆడుతూ 51 బంతుల్లోనే రెండో శతకం సాధించాడు. 95 పరుగులు వద్ద తిలక్ వర్మ ఇచ్చిన సులువైన క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర జాన్సన్ వదిలేశాడు. దీంతో 40 బంతుల్లోనే తిలక్ కూడా వరుసుగా రెండో సెంచరీ పూర్తి చేశాడు. 19 ఓవర్లో తిలక్ వర్మ 4, 6, 4తో దక్షిణాఫ్రికాలో అత్యధిక టి20 స్కోర్ 258 పరుగులను భారత జట్టు దాటేసింది. ఆఖరి ఓవర్ లో తిలక్ 4, శాంసన్ 6తో జట్టు 280కిపైగా పరుగులు చేసేలా చేయగలిగారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు తడబడింది. తొలి ఓవర్ లోనే ఆ జట్టుకు భారత బౌలర్ అర్ష్ దీప్ షాక్ ఇచ్చాడు. బౌలింగ్ కు పిచ్ అనుకూలించడంతో భారత బౌలర్లు విజృంభించారు. తొలి ఓవర్ లోనే ఓపెనర్ హెన్రిక్స్ (0) ను అర్ష్ దీప్ బోల్తా కొట్టించి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్ లోనే హార్దిక్ పాండ్యా అద్భుతమైన బంతితో మరో ఓపెనర్ రికెల్టన్ (1) ను అవుట్ చేశాడు. ఆ తరువాత వరస బంతుల్లోనే మార్కరమ్ (8), క్లాసన్ (0) ను వెంట వెంటనే అర్ష్ దీప్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు పది పరుగులకు నాలుగు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన స్టబ్స్, మిల్లర్ ఐదో వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వరుణ్ చక్రవర్తి చేతికి డేవిడ్ మిల్లర్ దొరికిపోగా, స్టబ్స్ ను భిస్నోయ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జాన్సన్ భారీ షాట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. వరుసగా వికెట్లు పడిపోవడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టు 148 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా తిలక్ వర్మ నిలిచాడు. భారత జట్టు బౌలర్లలో అర్ష్ దీప్ కు మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర పటేల్ కు రెండేసి వికెట్లు దక్కాయి.