టి20 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు షురూ..! తొలిసారి 20 దేశాలతో టోర్నీ

టి20 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు షురూ కానున్నాయి. జూన్ రెండో తేదీ నుంచి 29వ తేదీ వరకు మెగా టోర్నీ జరగనుంది. ఈ ఏడాది నిర్వహిస్తున్న టి20 వరల్డ్ కప్ పోటీలను వెస్టిండీస్, అమెరికా జట్లు కలిసి నిర్వహిస్తున్నాయి. తొలిసారిగా అనేక దేశాలు టీ20 క్రికెట్ వరల్డ్ కప్ లో పాల్గొంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి 20 జట్లు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొంటున్నాయి.

T20 cricket World Cup Trophy

టి20 క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ


టి20 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు షురూ కానున్నాయి. జూన్ రెండో తేదీ నుంచి 29వ తేదీ వరకు మెగా టోర్నీ జరగనుంది. ఈ ఏడాది నిర్వహిస్తున్న టి20 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను వెస్టిండీస్, అమెరికా కలిసి నిర్వహిస్తున్నాయి. తొలిసారిగా అనేక దేశాలు టీ20 క్రికెట్  వరల్డ్ కప్ లో పాల్గొంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి 20 జట్లు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొంటున్నాయి. టోర్నీ నిర్వాణకు అనుగుణంగా అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. తొమ్మిది నగరాల్లో 55 మ్యాచులు జరగనున్నాయి. మొత్తం జట్లను నాలుగు గ్రూపులుగా విడదీసి మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. గ్రూప్- ఏలో ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు ఆడనున్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా జట్లు ఆడతాయి. గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూపు నుంచి రెండు జట్లు సూపర్-8 దశకు చేరుకుంటాయి. 

అమెరికా - కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్

ఈ మెగా టోర్నీ అమెరికా, కెనడా మధ్య జరగనున్న మ్యాచ్ తో ప్రారంభం కానుంది. జూన్ రెండో తేదీన ఉదయం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ వెస్టిండీస్ లో జరగనుంది. రెండో మ్యాచ్ అదే రోజు సాయంత్రం 8 గంటలకు వెస్టిండీస్ లోనే వెస్టిండీస్, పపువా న్యూ గినియా జట్ల మధ్య జరగనుంది. జూన్ 4వ తేదీన భారత్ ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది. అమెరికాలోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్ తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. 

భారత కల నెరవేరేనా..?

ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ గత కొన్నాళ్లుగా నిరీక్షిస్తోంది. మహేంద్రసింగ్ ధోని సారధ్యంలో 2011లో భారత జట్టు ఐసిసి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. వరల్డ్ కప్ గెలిచిన రెండేళ్ల తర్వాత అంటే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు ధోని సారధ్యంలో అందుకుంది. 2014లో భారత జట్టు టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై ఓటమిపాలు కావడంతో కోట్లాదిమంది అభిమానులు ఆశలు అడియాసలు అయ్యాయి. 2015 లో డిపెండింగ్ ఛాంపియన్ గా వన్డే వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన భారత జట్టు అభిమానుల అంచనాలను నిజం చేస్తూ సెమీఫైనల్ వరకు చేరుకుంది. సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగులు తేడాతో ఓటమిని చవిచూసింది. 2022లో జరిగిన టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడిన భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లోను భారత జట్టు ఓటమిపాలైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా తో ఆడిన భారత జట్టు ఓటమిపాలైంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఐసీసీ ట్రోపీని దక్కించుకోకుండా భారత జట్టు ఎదురుచూస్తోంది ఈసారైనా టి20 వరల్డ్ కప్ సాధిస్తుందన్న ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి అభిమానుల ఆశలను భారత జట్టు నెరవేరుస్తుందో..? లేదో..? చూడాల్సి ఉంది. 

ఇది భారత జట్టు 

టి20 వరల్డ్ కప్ ఆడనున్న భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే భారత జట్టు సభ్యులు అమెరికాకు చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. భారత జట్టుకు కెప్టెన్ గా  రోహిత్ శర్మ వ్యవహరించనుండగా, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు సాంసన్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ సభ్యులుగా ఉన్నారు. రిజర్వు బెంచ్ ఆటగాళ్లుగా సుబ్ మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ ఎంపికయ్యారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్