సెమీస్ బెర్త్ ఎవరిదో.. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేడు కీలక పోరు.!

ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా శుక్రవారం కీలక మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్లో విజయం సాధించే జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు నాకౌట్ కు చేరుతుంది. ఆస్ట్రేలియా ఖాతాలో మూడు పాయింట్లు ఉండగా.. ఇంగ్లాండ్ జట్టుపై సంచలన విజయంతో ఆఫ్గనిస్తాన్ జట్టు 2 పాయింట్లతో ఈ రేసులో నిలిచింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఆస్ట్రేలియా జట్టు నాలుగు పాయింట్లతో ముందుకెళ్లే అవకాశం ఉంది. కానీ మూడు పాయింట్లతో నిలిచే ఆఫ్గానిస్థాన్ దాదాపు నిష్క్రమించినట్టే అవుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై అతి భారీ విజయం సాధిస్తే రన్ రేట్ ప్రకారం ఆఫ్గనిస్తాన్ జట్టుకు ఛాన్స్ ఉంటుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా శుక్రవారం కీలక మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్లో విజయం సాధించే జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు నాకౌట్ కు చేరుతుంది. ఆస్ట్రేలియా ఖాతాలో మూడు పాయింట్లు ఉండగా.. ఇంగ్లాండ్ జట్టుపై సంచలన విజయంతో ఆఫ్గనిస్తాన్ జట్టు 2 పాయింట్లతో ఈ రేసులో నిలిచింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఆస్ట్రేలియా జట్టు నాలుగు పాయింట్లతో ముందుకెళ్లే అవకాశం ఉంది. కానీ మూడు పాయింట్లతో నిలిచే ఆఫ్గానిస్థాన్ దాదాపు నిష్క్రమించినట్టే అవుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై అతి భారీ విజయం సాధిస్తే రన్ రేట్ ప్రకారం ఆఫ్గనిస్తాన్ జట్టుకు ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే షాహిదీ సేన ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. బుధవారం జరిగిన మ్యాచ్లో అసాధారణ ఆటతీరుతో పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును ఆఫ్గనిస్తాన్ జట్టు ఓడించింది. 200 పరుగులు కూడా కష్టమే అనుకున్న చోట జద్రాన్ వీరోచిత శతకంతో ఏకంగా 300కు పైగా పరుగులు జట్టు చేసేలా చేయగలిగాడు. అదే ఊపులో ఆస్ట్రేలియా అని కూడా మట్టి కల్పించాలన్న ఆశయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో మాక్స్వెల్ డబుల్ సెంచరీ తో ఆసీస్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అప్పటి ఓటమిని తాజా మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సరిచేయాలన్న లక్ష్యంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఉంది. ఈ ఫార్మాట్లో కంగారులపై తొలి విజయం అందుకోవాలని కుతూహలంతో ఆఫ్గనిస్తాన్ జట్టు బరిలోకి దిగుతోంది. అటు ఆస్ట్రేలియా జట్టు టోర్నీలో ఒక్క మ్యాచ్ పూర్తిగా ఆడింది. వర్షం కారణంగా దక్షిణాఫ్రికా తో మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా జట్టులో కమిన్స్, స్టార్క్, హజల్ వుడ్, మార్ష్ లేకపోయినా బలంగానే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 352 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించి తమ సత్తాను మరోసారి ఆస్ట్రేలియా జట్టు చాటింది. పైగా వారం రోజులు పాటు విశ్రాంతి లభించడంతో ఆస్ట్రేలియా ప్లేయర్లు తాజాగా బరిలోకి దిగబోతున్నారు. ఈ మ్యాచ్లో హెడ్, స్మిత్ బ్యాట్ ఝులిపిస్తే ఆస్ట్రేలియా జట్టు భారీ పరుగులను సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు షాక్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లకు తెలుసు. కాబట్టి అత్యంత జాగ్రత్తతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆఫ్గనిస్తాన్ జట్టు కూడా బలమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఇంగ్లాండ్ తో బరిలోకి దిగిన జట్టే ఆస్ట్రేలియా తో మ్యాచ్లోను బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన జద్రాన్ తోపాటు కీలక ఆటగాళ్లు రాణిస్తే ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదన్నా భావనను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఉన్న ఫామ్ బట్టి చూస్తే ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. లాహోర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్