ముగిసిన పారిస్ ఒలంపిక్స్.. అగ్రస్థానంలో కొనసాగిన అమెరికా, రెండో స్థానంలో చైనా

పారిస్ ఒలంపిక్స్ ముగిశాయి. రెండు వారాలకుపైగా వేలాది మంది అథ్లెట్లు తమ అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించి విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది క్రీడాభిమానులను అలరించారు. ఏ ఆటగాడైనా, ఏ జట్టు అయినా ఎంత బాగా ఆడారన్నది అంతిమంగా వారు సాధించే పతకాన్ని చూసి నిర్ధారిస్తారు. ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో మాదిరే అమెరికా సోవియట్ రష్యా విశ్వ క్రీడల్లోనూ నువ్వా నేనా అనేలా ఢీకొనేవి. కానీ, కాలం మారింది ప్రస్తుతం అగ్ర దేశం అమెరికాకు అన్ని రంగాల్లో చైనా సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే ఒలంపిక్స్ లోను అమెరికాతో సై అంటోంది.

Paris Olympics Closing Ceremony

పారిస్ ఒలంపిక్స్ ముగింపు వేడుకలు 

పారిస్ ఒలంపిక్స్ ముగిశాయి. రెండు వారాలకుపైగా వేలాది మంది అథ్లెట్లు తమ అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించి విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది క్రీడాభిమానులను అలరించారు. ఏ ఆటగాడైనా, ఏ జట్టు అయినా ఎంత బాగా ఆడారన్నది అంతిమంగా వారు సాధించే పతకాన్ని చూసి నిర్ధారిస్తారు. ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో మాదిరే అమెరికా సోవియట్ రష్యా విశ్వ క్రీడల్లోనూ నువ్వా నేనా అనేలా ఢీకొనేవి. కానీ, కాలం మారింది ప్రస్తుతం అగ్ర దేశం అమెరికాకు అన్ని రంగాల్లో చైనా సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే ఒలంపిక్స్ లోను అమెరికాతో సై అంటోంది. పారిస్ ఒలింపిక్స్ లో ఈసారి స్వర్ణ పతకాల కోసం రెండు దేశాలు హోరాహోరీగా తలపడ్డాయి. శనివారం పోటీలు ముగిసేసరికి 39 స్వర్ణాలతో చైనా ఆధిపత్యం చలాయించింది. అమెరికా ఒకటి తక్కువగా అంటే 38 స్వర్ణ పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో ఆఖరి రోజు ఆదివారం జరిగే ఈవెంట్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైనాను దాటేసి అమెరికా పతక రేసులో అగ్రస్థానంలో నిలుస్తుందా..? లేదంటే డ్రాగన్ ఆధిపత్యం కొనసాగుతుందా.? అనే విషయమై జోరుగా చర్చలు జరిగాయి. చివరి రోజు వెయిట్ లిఫ్టింగ్ మహిళల 81 కిలోల విభాగంలో లీవెన్ వెన్ స్వర్ణం సాధించడంతో చైనా పథకాల సంఖ్య 40కి చేరింది. సైక్లింగ్ మహిళల ఓమ్నియమ్ కేటగిరీలో జెన్నిఫర్ వాలెంట్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకుంది. దీంతో అమెరికా స్వర్ణాల సంఖ్య 39కి చేరింది.

ఈ నేపథ్యంలో మహిళల బాస్కెట్బాల్ స్వర్ణ పతక పోరుపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టే అమెరికా - ఫ్రాన్స్ ఆ మ్యాచ్ లో తగ్గేదేలే అన్నట్లు ఆడాయి. చివరికి ఒక పాయింట్ తేడాతో జై కేతనం ఎగరవేసిన అమెరికా బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. దీంతో అమెరికా - చైనా చెరో 40 స్వర్ణ పథకాలతో సమంగా నిలిచాయి. ఆఖరి రోజు అమెరికా మొత్తం ఐదు పథకాలు తన ఖాతాలో వేసుకుంది. బాస్కెట్బాల్, సైక్లింగ్ లో స్వర్ణాలతోపాటు రెజ్లింగ్ మహిళల 76 కిలోలు, మహిళల వాలీబాల్ లో రజతాలు, పురుషుల వాటర్ పోల్ లో కాంస్య పతకం సొంతం చేసుకుంది.  అమెరికా కాంస్య పతకంలో ఆదివారం ఒకటి తగ్గింది. జిమ్నాస్టిక్స్ మహిళల ఫ్లోర్లో ఫైనల్ లో అమెరికాకు చెందిన జొర్దాన్ చైల్స్ అందుకున్న కాంస్యాన్ని రుమేనియా జిమ్నాస్ట్ అనాకు ప్రకటించారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు మేరకు పారిస్ క్రీడల నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 126 మెడల్స్ తో అమెరికా తనకు తిరిగి లేదని మరోసారి నిరూపించుకుంది. టోక్యో క్రీడల పసిడి పతకాల్లోనూ అమెరికా (39) దే పైచేయి. అప్పుడూ చైనా 38 పతకాలతో రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. పారిస్ ఒలంపిక్స్ లో చైనా 40 స్వర్ణాలు, 27 రజతాలు, 24 కాంస్య పతకాలతో మొత్తంగా 91 పతకాలు సాధించింది. మూడో స్థానంలో జపాన్ 45 పతకాలతో ఆస్ట్రేలియా 53 పతకాలతో నాలుగు, ఫ్రాన్స్ 64 పతకాలతో ఐదు, నెదర్లాండ్స్ 34 పతకాలతో ఆరు, బ్రిటన్ 65 పతకాలతో ఏడు, 32 పతకాలతో కొరియా ఎనిమిదో స్థానంలో, 40 పతకాలతో ఇటలీ తొమ్మిదో స్థానంలో, 33 పతకాలతో జర్మనీ పదవ స్థానంలో నిలిచాయి. ఇక పారిస్ ఒలంపిక్స్ లో ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు కలిపి మొత్తంగా ఆరు పతకాలతో భారత్ ఈ జాబితాలో 71 వ స్థానంలో నిలిచింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్