ఆస్ట్రేలియా వన్డే, టి20 జట్టుకు నూతన సారధిని నియమించారు. జోష్ ఇంగ్లీష్ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్ తో టి20 వన్డే సిరీస్ ఆడనుంది. ఈ టి20 సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టును ఇంగ్లీష్ ముందుండి నడిపించనున్నాడు. దీనికి ముఖ్యమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి సన్నాహాలపై కీలక టెస్టు ఆటగాళ్లు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే వన్డే, టి20లకు కొత్త కెప్టెన్ ను ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది.
జోష్ ఇంగ్లీష్
ఆస్ట్రేలియా వన్డే, టి20 జట్టుకు నూతన సారధిని నియమించారు. జోష్ ఇంగ్లీష్ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్ తో టి20 వన్డే సిరీస్ ఆడనుంది. ఈ టి20 సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టును ఇంగ్లీష్ ముందుండి నడిపించనున్నాడు. దీనికి ముఖ్యమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి సన్నాహాలపై కీలక టెస్టు ఆటగాళ్లు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే వన్డే, టి20లకు కొత్త కెప్టెన్ కొత్త కెప్టెన్ ను ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది. టి20, వన్డే జట్ల బాధ్యతలను ఇంగ్లీష్ చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30 వ కెప్టెన్ గా, టి20 జట్టుకు 14 వ కెప్టెన్ గా ఇంగ్లీష్ నిలిచాడు. పాకిస్తాన్తో జరిగే వైట్ బాల్ సిరీస్ లో జోష్ ఇంగ్లీష్ ఈ బాధ్యతలను చేపట్టనున్నాడు. పాకిస్తాన్ తో సిరీస్ కు మాత్రమే ఇంగ్లీష్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియా జట్టుకు చెందిన కీలక ఆటగాళ్లు అందరూ భారత్తో జరిగే సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా జట్టు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి ఇంగ్లీష్ సారధ్యంలోనే యువ ఆటగాళ్లకు వన్డే, టి20 సిరీస్ లో అవకాశాలను కల్పిస్తోంది. ఆస్ట్రేలియా జట్టుకు రెగ్యులర్ వన్డే కెప్టెన్ గా కమిన్స్ వ్యవహరిస్తున్నాడు. ఇటువంటి జట్టుకు కెప్టెన్ గా మిచెల్ మార్స్ ఉన్నాడు. వీరంతా పాకిస్తాన్ తో సిరీస్ లో ఆడడం లేదు. ఇప్పటికే రెండు వన్డేలు పాకిస్తాన్తో ఆస్ట్రేలియా జట్టు ఆడింది. మూడో వన్డే నుంచి కెప్టెన్ గా ఇంగ్లీష్ వ్యవహరించనున్నాడు. వన్డేల తర్వాత జరగనున్న టి20 మ్యాచ్ లకు ఇంగ్లీషే కెప్టెన్గా వ్యవహరిస్తాడు. నవంబర్ 10వ తేదీన మూడో వన్డే జరగనుంది. అనంతరం టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 18వ తేదీ వరకు మూడు టి20 మ్యాచ్ లు ఆడనున్నారు.