ఛాంపియన్స్ లీగ్ లో నేడు కీలక పోరు.. దాయాదుల అమీతుమీ.!

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే కీలక పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూసే భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు ఆదివారం జరగనుంది. ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ఈ రెండు జట్లు ఆదివారం తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో చిరకాల శత్రువులుగా పేరు తెచ్చుకున్న ఈ రెండు జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ ఆదివారం జరగబోతోంది. గ్రూప్ ఎలో ఇరుజట్లకు ఇది రెండో మ్యాచ్. ఇప్పటికే టికెట్లు అన్నీ హార్ట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

The captains of both teams

ఇరు జట్ల కెప్టెన్లు

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే కీలక పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూసే భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు ఆదివారం జరగనుంది. ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ఈ రెండు జట్లు ఆదివారం తలపడనున్నాయి.  దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో చిరకాల శత్రువులుగా పేరు తెచ్చుకున్న ఈ రెండు జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ ఆదివారం జరగబోతోంది. గ్రూప్ ఎలో ఇరుజట్లకు ఇది రెండో మ్యాచ్. ఇప్పటికే టికెట్లు అన్నీ హార్ట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో స్టేడియం వేలాదిమంది అభిమానులతో కిక్కిరిసిపోనుంది. టోర్నీకి ఆతిధ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడేందుకు స్వదేశం నుంచి దుబాయ్ రావాల్సి వచ్చింది. భద్రతా కారణాల రీత్యా భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించేందుకు అంగీకరించలేదు. హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీని నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఓటమి పాలై తీవ్ర ఒత్తిడిలో ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతుండగా.. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయాన్ని సాధించి ఆత్మవిశ్వాసంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. మరొక్క మ్యాచ్ లో విజయం సాధిస్తే భారత్ గట్టు చేరినట్టే. అటు పాకిస్తాన్ ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్ పై ఓటమిపాలైంది. భారత్ పై విజయం సాధించడం ద్వారా గెలవడం ద్వారా సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఆ జట్టు భావిస్తుంది. 

తీవ్ర ఒత్తిడిలో పాకిస్తాన్ జట్టు..

పాకిస్తాన్ జట్టు కివీస్ చేతిలో తొలి మ్యాచ్లో ఓటమిపాలు కావడంతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. పైగా చిరకాల శత్రువు భారత్తో మ్యాచ్ కావడం.. గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉండే పరిస్థితి నెలకొనడంతో వీరు ప్రదర్శన పై ఆసక్తి ఏర్పడింది. అలాగే తొలి మ్యాచ్లో స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఆటతీరు విమర్శల పాలైంది. 320 పరుగుల చేతనలో అతడు 90 బంతుల్లో 64 పరుగులు చేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేనికి తోడు భారత్ పై ఆడిన 8 మ్యాచ్లో బాబర్ 218 పరుగులు చేయగలిగాడు. ఇక టీమిండియా పై చెలరేగే ఓపెనర్ ఫకర్ జమాన్ టోర్నీకి దూరం కావడం పెద్దలోటే. అతని స్థానంలో ఇమామ్ ఉల్ హక్ ను తీసుకున్నారు. బ్యాటింగ్లో రిజ్వాన్, సల్మాన్ ఆఘా, సాద్ షకీల్ కీలకము కానున్నారు. బౌలింగ్ లో పేసర్లు షహీన్ షా, నసీమ్ షా, రౌఫ్ ఆరంభంలో భారత జట్టును కట్టడి చేయాలనుకుంటున్నారు. స్పిన్ లో అబ్రార్ అహ్మద్ ఆకట్టుకున్నాడు. 

విరాట్ కోహ్లీ ఆడేనా..!

పాకిస్తాన్తో పోలిస్తే భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్ గిల్ భీకర ఫామ్ కొనసాగిస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్టు సమయంలో ఆడుతున్నాడు. అటు కెప్టెన్ రోహిత్ ఎటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థి బౌలర్ల పై ఒత్తిడి పెంచుతున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం బ్యాట్ గఝులిపించాల్సి ఉంది. శనివారం ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత తను ఎడమ కాలిపై ఐస్ బ్యాక్ పెట్టుకుని సేద తీరడం ఫ్యాన్సను ఆందోళన పరిచింది. విరాట్ కోహ్లీ విషయానికి సంబంధించి బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కోహ్లీ అందుబాటులో లేకపోతే వన్ టౌన్ లో రిజర్వ్ ప్లేయర్ కూడా లేడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయాస్ అయ్యర్, రాహుల్, అక్సర్, హార్దిక్ పాండ్యా చెలరేగితే భారీ స్కోర్ ఖాయమే. బౌలింగ్ విభాగంలో షమీ అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్ పై ఐదు వికెట్లతో రాణించిన తను మంచి జోష్ లో ఉన్నాడు. పాకిస్తాన్ పై అతడు ఎకానమీ 3.82 గా ఉంది. షమీకి మరో ఎండ్ లో హర్శిత్ నుంచి మద్దతు లభిస్తోంది. స్పిన్ త్రయం జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో కీలకము కానున్నారు. 

పిచ్ అంచనా 

మైదానం విషయానికి వస్తే బంగ్లాదేశ్ తో జరిగిన పిచ్చు మందకోడిగా మారడంతో పరుగులు వేటలో భారత్ కాస్త ఇబ్బంది పడింది. అయితే ఇక్కడ మంచి ప్రభావం కూడా లేకపోవడంతో టాస్ గెలిచినట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 

జట్లు అంచనా ఇదే..

భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్  పటేల్, హర్షిత్, షమీ, కుల్దీప్ యాదవ్ 

పాకిస్తాన్ జట్టు అంచనా 

ఇమామ్ హుల్ హక్, బాబర్, సాద్ షకీల్, రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహీర్, కుష్దీల్ షా, షాహీన్ షా, నషీమ్ షా, హరీష్ రౌఫ్, అబ్రార్ అహ్మద్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్