టి20 వరల్డ్‌ కప్‌లో కీలక పోరు.. భారత్‌-పాక్‌ ఢీ

టీ20 క్రికెట్‌ ప్రపంచలో ఆదివారం కీలక పోరు జరగనుంది. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే భారత్‌-పాక్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ వరల్డ్‌ కప్‌లో జరగనుంది. అమెరికాలోని నసా స్టేడియం వేదికగా ఆదివరా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ జరగనుంది.

Captains of India - Pakistan teams

భారత్ - పాక్ జట్ల సారధులు


టీ20 క్రికెట్‌ ప్రపంచలో ఆదివారం కీలక పోరు జరగనుంది. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే భారత్‌-పాక్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ వరల్డ్‌ కప్‌లో జరగనుంది. అమెరికాలోని నసా స్టేడియం వేదికగా ఆదివరా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌లో జరిగిన ముఖాముఖి పోరులో 6-1 విజయాలతో భారత్‌ మెరుగైన రికార్డుతో ముందంజలో ఉంది. తొలి మ్యాచ్‌లో పసికూన అమెరికా చేతిలో ఓటమి పాలైన పాక్‌ జట్టు భారత్‌ను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తిగా మారింది. ఈ రెండు జట్లు ఆఖరిగా 2022 టీ20 వరల్డ్‌ కప్‌లో తలపడ్డాయి. ఆఖరి బంతికి భారత్‌ గెలిచింది. ఉగ్రదాడులకు అవకాశముందన్న హెచ్చరికలు నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌కు భారత్‌ ఉత్సాహంతో బరిలోకి దిగుగుతుండగా, తొలి మ్యాచ్‌లో పసికూన చేతిలో ఓడిపోయిన ఒత్తిడితో పాక్‌ దిగుతోంది. కొత్త బంతిని ఎదుర్కొనేందుకు ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్‌, విరాట్‌ ఓపెనర్లుగా రానున్నారు. వన్‌ డౌన్‌లో పంత్‌ ఫామ్‌ జట్టుకు సానుకూలాంశం. పాక్‌ స్పిన్నర్లపై ఎదురుదాడి చేసేందుకు శివమ్‌ దూబే సిద్ధంగా ఉన్నాడు. ఐర్లాండ్‌తో ఆడిన మాదిరిగానే భారత్‌ నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. ఇక పాకిస్థాన్‌ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఈ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై ఓడిపోవడాన్ని అలవాటుగా మార్చుకున్న పాక్‌.. ఈ మ్యాచ్‌లో ఎటువంటి ప్రదర్శన చేస్తుందన్న ఆసక్తి సర్వత్రానెలకొంది. భారత్‌పై విజయం సాధించాలంటే పాక్‌ పేసర్లు రాణించడం కీలకం. పేసర్లు షహీన్‌ షా అప్రిది, నసీమ్‌, అమిర్‌, రౌఫ్‌ తమ పేస్‌ పదునుతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. బ్యాటింగ్‌లో రిజ్వాన్‌, ఉస్మాన్‌ విఫలమవుతున్నారు. బాబర్‌ వేగంగా ఆడాల్సి ఉంది. స్పిన్నర్‌ షాదాబ్‌ స్థానంలో నయీమ్‌ అయూబ్‌ను తీసుకునే చాన్స్‌ ఉంది. ఉదయం 10 గటలకు వర్షం కురిసే అవకాశముంది. టాస్‌ ఆలస్యం కావచ్చు. పిచ్‌ను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటి దాకా జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో 100 ప్లస్‌ పరుగులు రెండు సార్లు మాత్రమే చేశారు. పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవాశముంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. 

ఇవీ తుది జట్లు అంచనా..

భారత్‌ : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, పంత్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే, హార్ధిక్‌ పాండ్యా, జడేజా, అక్షర్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌

పాక్‌ జట్టు : రిజ్వాన్‌, ఉస్మాన్‌, బాబర్‌ అజమ్‌ (కెప్టెన్‌), ఫకర్‌, అజమ్‌ ఖాన్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌/సయీమ్‌, షహీన్‌, నషీమ్‌ షా, అమిర్‌, రౌఫ్‌



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్