శ్రీలంక వేదికగా జరుగుతున్న వుమెన్స్ ఆసియా కప్ టైటిల్‌ను శ్రీలంక మహిళల జట్టు గెల్చుకుంది. ఆదివారం మధ్యాహ్నం దంబుల్లాలోని రన్‌గిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేయగా, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు అలవోకగా లక్ష్యాన్ని చేధించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ చేజిక్కించుకుంది.
విజయానందంలో శ్రీలంక మహిళల జట్టు
శ్రీలంక వేదికగా జరుగుతున్న వుమెన్స్ ఆసియా కప్ టైటిల్‌ను శ్రీలంక మహిళల జట్టు గెల్చుకుంది. ఆదివారం మధ్యాహ్నం దంబుల్లాలోని రన్‌గిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేయగా, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు అలవోకగా లక్ష్యాన్ని చేధించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ చేజిక్కించుకుంది. లక్ష్య చేధనలో శ్రీలంక మహిళలు జట్టు రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు సఫాలీ వర్మ, స్మృతి మంధాన దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 6.2 ఓవర్‌లో 44 పరుగులు వద్ద భారత మహిళ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. 19 బంతుల్లో 16 పరుగులు చేసిన సఫాలీ వర్మను కవిస దిల్మారీ ఎల్‌బీడబ్ల్యుగా వెనక్కి పంపించింది. ఆ తరువాత వచ్చిన ఉమా చెత్రీ 9(7), కెప్టెన్ హరంప్రీత్ కౌర్ 11 (11) రాణించలేకపోయారు. రోడ్రిగేస్ 29(16)తో కలిసి స్మృతి మంధాన స్కోరును పరుగులు పెట్టించే ప్రయత్నం చేసింది. ఆ తరువాత వచ్చిన రిషా ఘోష్ 30(14) కూడా స్మృతి మంథానకు సహకారాన్ని అందించడంతో జట్టు 165 పరుగులకు చేరుకుంది. భారత జట్టులో టాప్ స్కోరర్‌గా స్మృతి మంథాన నిలిచింది. 47 బంతుల్లో పది ఫోర్లు సాయంతో 60 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించింది. శ్రీలంక బౌలర్లలో కవిశా దిల్హారీ రెండు, సచిని నిశాన్షాలా, కెప్టెన్ చమేరీ ఆటపట్టు, ప్రభోధిని ఒక్కో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళలు జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ విస్మి గుణరత్నే 1 (3) వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, మరో ఓపెనర్, కప్టెన్ చమేరీ ఆటపట్టు వన్‌డౌన్‌లో వచ్చిన హర్షితా కమరవిక్రమ్‌తో కలిసి జట్టును విజయం దిశగా నడిపిచింది. ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వరుస బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయి లక్ష్యం దిశగా జట్టును పరుగులు పెట్టించారు. 43 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సులు సహాయంతో 61 పరుగులు చేసిన ఆటపట్టు 11.6 ఓవర్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగింది. ఈ సమయంలో మళ్లీ శ్రీలంక మహిళల జట్లు చిక్కుల్లో పడినట్టు కనిపించింది. అయితే, రెండో డౌన్‌లో కవిశా దిల్హారి 30 (16)తో కలిసి హర్షితా సమరవిక్రమ జట్టుకు విజయాన్ని అందించింది. మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. భారత జట్టు బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. రాధా యాదవ్ నాలుగు ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకోగా, మిగిలిన బౌలర్లు భారీగానేపరుగులు ఇచ్చుకున్నారు. దీప్తి శర్మ ఒక్క వికెట్ మాత్రమే దక్కించుకుంది.
తొలిసారి విజేతగా నిలిచిన శ్రీలంక
2008 నుంచి వుమెన్స్ ఆసియా కప్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఆసియా కప్ పోటీలు నిర్వహించగా, తొలిసారి శ్రీలంక జట్టు టైటిల్‌ను గెల్చుకుంది. ఏడుసార్లు భారత మహిళల జట్టే విజేతగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హర్షితా సమరవిక్రమా నిలువగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా చమేరి ఆటపట్టు నిలిచింది.